AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న Project K అప్ డేట్‌.. మూవీ స్టోరీకి సంబంధించి ఆసక్తికర విషయాలు

ప్రభాస్‌తో పాటు ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకోన్ నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియాకు మించి గ్లోబల్‌ మూవీ అన్న రేంజ్‌లో ఆ మూవీ మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేయకపోయినా...

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న Project K అప్ డేట్‌.. మూవీ స్టోరీకి సంబంధించి ఆసక్తికర విషయాలు
Project K
Janardhan Veluru
|

Updated on: May 11, 2023 | 12:45 PM

Share

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో విజువల్ వండర్ ప్రాజెక్ట్ కే (Project K). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డార్లింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఎవ్వర్ మూవీగా నిలిచిపోవడం ఖాయమన్న టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ రేంజ్‌లో భారీ అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్‌తో పాటు ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకోన్ నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియాకు మించి గ్లోబల్‌ మూవీ అన్న రేంజ్‌లో ఆ మూవీ మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేయకపోయినా… ఈ సినిమా టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందన్న టాక్ అయితే ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌ను జెట్‌ స్పీడుతో ఫినిష్ చేసేస్తున్నారు మేకర్స్‌. ఆ సినిమా ప్రొడక్షన్‌ వర్క్‌ ఇప్పటికే 75 శాతానికి పైగా పూర్తయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ సంబంధించిన షూటింగ్‌ను దాదాపుగా ఫినిష్ చేసేశారట. పెండింగ్ వర్క్‌ను కూడా మరో మూడు, నాలుగు వారాల్లోనూ పూర్తి చేసేలా నాగ్ అశ్విన్ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారని తెలుస్తోంది.

సోషియో ఫాంటసీ కథ కావటంతో.. అందుకు తగ్గట్టుగా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు మేకర్స్‌. ముఖ్యంగా సెట్స్, వెహికల్స్‌ లాంటి వాటిని యంగ్ ఇంజనీర్స్‌ను హైర్‌ చేసి మరి డిజైన్ చేయిస్తున్నారు. ప్రజెంట్ ఇదే వర్క్ జరుగుతోందని… ఈ సినిమా డార్లింగ్ ఫ్యాన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని హామీ ఇస్తున్నారు కెప్టెన్ నాగీ. ఆల్రెడీ ప్రమోషన్‌ స్టార్ట్ చేసి వరుసగా మేకింగ్ వీడియోలతో అప్‌డేట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రీ ఇన్వెంటింగ్‌ ద వీల్, అసెంబ్లింగ్‌ ది రైడర్స్ పేరుతో ఇప్పటికే రెండు మేకింగ్ వీడియోస్‌ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సినిమా మీద అంచనాలు భారీగా పెంచేశాయి. దీంతో ఆ రేంజ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అయ్యేలా కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్‌గా ఎమర్జ్ అవుతారంటున్నారు డైహార్డ్‌ ఫ్యాన్స్‌.

అయితే ఈ మూవీకి సంబంధించిన మరో టాక్ కూడా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూవీని ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు 2024 జనవరిలో రిలీజ్ చేసే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు చదవండి

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్