Malli Pelli: ‘వర్షం, నువ్వు చెప్పిరారు కదా..’ నరేష్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్.. మీరూ చూసేయ్యండి..
నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ సినిమాకు ఎం.ఎస్. రాజు దర్శకుడు. నటుడు వ్యక్తిగత జీవితంలో..
నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ సినిమాకు ఎం.ఎస్. రాజు దర్శకుడు. నటుడు వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో నరేంద్రగా నరేష్, పార్వతిగా పవిత్రా లోకేష్ కనిపించారు. అలాగే మరో కీలక పాత్రలో తమిళ నటి వనితా విజయ్ కుమార్ నటిస్తున్నారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగగా, డైలాగ్స్ అలరించాయి. కాగా, ఈ మూవీ మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.