Salaar Movie: ఫ్యాన్స్ బీ రెడీ.. ‘సలార్’ టీజర్ వచ్చేస్తోంది.. ఆ రోజునే రిలీజ్ చేసేందుకు ప్లాన్..
ఇప్పటికే విడుదలైన లొకేషన్ ఫోటోస్ అంచనాలను పెంచేశాయి. ఇక కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు పరాజయం కావడంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ఆయన రాబోయే సినిమాలపైనే ఉన్నాయి. ప్రస్తుతం చేతిలో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇప్పటికే ఆదిపురుష్ చిత్రం షూటింగ్ కంప్లీట్ కాగా.. సలార్, ప్రాజెక్ట్ కె మూవీ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇక ఇప్పుడు సౌత్ టూ నార్త్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్న చిత్రం సలార్. కేజీఎఫ్ సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన లొకేషన్ ఫోటోస్ అంచనాలను పెంచేశాయి. ఇక కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా సలార్ టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈమూవీ టీజర్ కుదిరితే జాన్ చివరి వారంలోనే విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాగైతే కోరుకుంటున్నారో ఆ అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. జూన్ 16న ప్రభాస్, కృతి సనన్ కలిసి నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విడుదలైన కొద్దిరోజులకే అంటే జూన్ చివరివారంలో సలార్ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అదే కనుక జరిగితే ప్రభాస్ అభిమానులకు జూన్ నెలలో రెండు పండగలు రాబోతున్నాయి.




డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ సలార్ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.




