AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: కమెడియన్‌ ముక్కు అవినాశ్‌పై బన్నీ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. వెంటనే ఆ ఫొటో డిలీట్‌ చేయాలంటూ వార్నింగ్‌

అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు పుష్ప 2 మేకర్స్‌. అదిరిపోయే స్పెషల్‌ వీడియోతో పాటు సినిమాలో బన్నీ లుక్‌ని రివీల్‌ చేసి సినిమాపై మరింత హైప్‌ పెంచారు. ముఖ్యంగా చీరకట్టు, ముక్కు పుడకతో గంగమ్మ అవతారంలో కనిపించిన బన్నీ లుక్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

Allu Arjun: కమెడియన్‌ ముక్కు అవినాశ్‌పై బన్నీ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. వెంటనే ఆ ఫొటో డిలీట్‌ చేయాలంటూ వార్నింగ్‌
Allu Arjun, Avinash
Basha Shek
|

Updated on: Apr 12, 2023 | 6:47 AM

Share

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప 2’. సుమారు రెండేళ్ల క్రితం రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన పాన్‌ ఇండియా సినిమా పుష్పకు ఇది సీక్వెల్‌. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రష్మకి మందన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ షర వేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు పుష్ప 2 మేకర్స్‌. అదిరిపోయే స్పెషల్‌ వీడియోతో పాటు సినిమాలో బన్నీ లుక్‌ని రివీల్‌ చేసి సినిమాపై మరింత హైప్‌ పెంచారు. ముఖ్యంగా చీరకట్టు, ముక్కు పుడకతో గంగమ్మ అవతారంలో కనిపించిన బన్నీ లుక్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఇదే విషయంలో అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్‌ ముక్కు అవినాశ్‌. ఇంతకీ అతను ఏం చేశాడంటే..

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పుష్ప 2 లుక్‌ని ఇమిటేట్‌ చేశాడు కమెడియన్‌ అవినాశ్‌. అరకొర ఎడిటింగ్‌తో బన్నీ లుక్‌ని కాస్త మార్ఫింగ్‌ చేసి తన ఫొటోను పెట్టుకున్నాడు. అనంతరం దీనిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇదే ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. ‘అరకొర ఎడిటింగ్‌తో ఇష్టమొచ్చినట్లు ఫొటోను మార్ఫింగ్‌ చేస్తావా? బన్నీ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది’ అంటూ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. ‘అర్జెంట్‌గా ఫొటో డిలీట్‌ చేయకపోతే బాగోదు’ అంటూ మాస్‌ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్‌ అయిన ముక్కు అవినాశ్‌ బిగ్‌బాస్‌ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు టీవీ షోల్లో నటిస్తూ బిజిబిజీగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!