దైవం మానుష్య రూపేన అంటున్న నిఖిల్.. కార్తికేయ మూవీ సీక్వెల్ కు ఇంట్రస్టింగ్ టైటిల్
హ్యాపీడేస్ సినిమా తర్వాత కుర్రహీరో నిఖిల్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లో కథల విషయంలో కాస్త కంగారు పడ్డా ఇప్పుడు ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు.
హ్యాపీడేస్ సినిమా తర్వాత కుర్రహీరో నిఖిల్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లో కథల విషయంలో కాస్త కంగారు పడ్డా ఇప్పుడు ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. విభిన్నకథలను సెలక్ట్ చేసుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు. అర్జున్ సురవరం సినిమా తర్వాత ఈ కుర్ర హీరో దూకుడు పెంచాడు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ’18 పేజెస్’ అయితే, మరొకటి ‘కార్తికేయ 2′. ఆల్రెడీ ’18 పేజెస్’ సినిమాను పూర్తి చేసిన నిఖిల్, ఇప్పుడు పూర్తి దృష్టి ‘కార్తికేయ 2’పై పెట్టాడు. చందు మొండేటి – నిఖిల్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ”దైవం మానుష్య రూపేన” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇదే టైటిల్ గా ఖరారు కావొచ్చునని అంటున్నారు. వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా థ్రిల్లింగ్ మిస్టరీ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యంతో ముడిపడి ఈ సినిమా కథ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. గుజరాత్ .. ఉత్తరాఖండ్ .. హిమాచల్ ప్రదేశ్ .. రాజస్థాన్ లోని లొకేషన్స్ లో కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరిపారు. తదుపరి షెడ్యూల్ ను యూరప్ దేశాలలో ప్లాన్ చేశారట. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో పాటుగా ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలోఈ యంగ్ హీరో ఓ మూవీ కమిట్ అయ్యారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :