Naga Chaitanya: నడి సంద్రంలో ‘తండేల్’ షూటింగ్.. చైతూ ఫోటోతో సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
ప్రస్తుతం తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం కోసం చైతూ తన లుక్ పూర్తిగా మార్చేసి రగ్గడ్ లుక్‌లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి లీకైన చైతన్య ఫోటో చూస్తే.. ఇందులో చైతూ ఊరమాస్ అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే ‘ధూత’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టాడు యువసామ్రాట్ నాగచైతన్య. సస్పెన్స్ థ్రిల్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్‌లో చైతూ మొదటిసారిగా జర్నలిస్ట్ పాత్రలో కనిపించారు. ఇందులో చైతూ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు చైతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం కోసం చైతూ తన లుక్ పూర్తిగా మార్చేసి రగ్గడ్ లుక్‌లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి లీకైన చైతన్య ఫోటో చూస్తే.. ఇందులో చైతూ ఊరమాస్ అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మత్య్సకారుల జీవిత కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అందించారు. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ కొత్త షెడ్యూల్ సముద్రం మధ్యలో జరగనుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమా నుంచి చైతుపై ఓ ఎనర్జిటిక్ స్టిల్ రివీల్ చేశారు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ అందిస్తామని అంటున్నారు మేకర్స్. మొత్తానికి ఈ క్రేజీ అప్డేట్ తో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో చైతూ జోడిగా సాయి పల్లవి నటిస్తుంది.
Team #Thandel begins an adrenaline pumping schedule in middle of the oceans 🌊
Shoot in progress 🎥
Exciting updates soon 💥#Dhullakotteyala i🔥 Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli pic.twitter.com/v1LimLU4XI
— Thandel (@ThandelTheMovie) December 26, 2023
మత్య్సకారుల జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్. చైతూ చివరిసారిగా కస్టడీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇందులో కృతిశెట్టి కథానాయికగా నటించగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.
#Thandel all set to sail ! Special thanks to @VenkyMama @iamnagarjuna for being my strength always ! @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli @KarthikTheeda @bhanu_pratapa @viswanathart @GeethaArts pic.twitter.com/VAq985yvrM
— chaitanya akkineni (@chay_akkineni) December 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.