Prabhas: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రభాస్‌కు ఆహ్వానం.. ఆ సెలబ్రెటీలకు కూడా..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన రాముడి ఆలయంలో వచ్చే నెల 22న రాముడి ప్రాణ ప్రతిష్ట చేయాలని నిర్ణయంచారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని భావిస్తుంది కేంద్రం. దేశ వ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది కేంద్రం. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులను, నాయకులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటరైనర్కు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ మాస్ నటవిశ్వరూపం చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లకు తమ అభిమాన హీరో ఖాతాలో మరో హిట్ పడడంతో ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. ఉత్తర ప్రదేశ్‍లోని అయోధ్య రామాలయంలో వచ్చే నెల 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రభాస్ ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. ఆయనతోపాటు.. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్, అజయ్ దేవ్‌గణ్, సన్నీ డియోల్, యశ్ సహా మిగిలిన బాలీవుడ్ తారలకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన రాముడి ఆలయంలో వచ్చే నెల 22న రాముడి ప్రాణ ప్రతిష్ట చేయాలని నిర్ణయంచారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని భావిస్తుంది కేంద్రం. దేశ వ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది కేంద్రం. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులను, నాయకులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మొత్తం రెండు వేల మందికి ఆలయ ట్రస్టు బోర్డు అధికారికంగా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.
View this post on Instagram
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితోపాటు.. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రజినీకాంత్, మోహన్ లాల్, సంజయ్ లీలా భన్సాలీ, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, ధనుష్, రిషబ్ శెట్టి, మోహన్ లాల్‌కు ఆహ్వానించారు. ఇదిలా ఉంటే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోద్య రామమందిరానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంతపెద్ద విపత్తు వచ్చినా 2,500 ఏళ్లు తట్టుకొని నిలబడేలా ఆలయాన్ని డిజైన్ చేసినట్లు ఆర్కిటెక్ట్ అశీశ్ సోంపురా తెలిపారు. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబిచేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.