Tollywood : ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్.. టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చిన మైథలాజికల్ మూవీస్

తెలుగు సినిమా స్థాయి అంతకంతకూ పెరుగుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో హనుమాన్ సినిమా విడుదలైంది. సంక్రాంతి బరిలో నిలిచింది ఈ సినిమా. జనవరిలో విడుదలైన ఈ సినిమా భారీ అంచనాలను అందుకుంది. మైథలాజికల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ నటించాడు.

Tollywood : ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్.. టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చిన మైథలాజికల్ మూవీస్
Kalki 2898 Ad
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 01, 2024 | 12:56 PM

ఈ ఏడాది టాలీవుడ్ లో పండగ వాతావరణం కనిపిస్తుంది. కొత్త ఏడాది వచ్చి అప్పుడే ఆరు నెలలు పూర్తయ్యింది. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమా స్థాయి అంతకంతకూ పెరుగుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో హనుమాన్ సినిమా విడుదలైంది. సంక్రాంతి బరిలో నిలిచింది ఈ సినిమా. జనవరిలో విడుదలైన ఈ సినిమా భారీ అంచనాలను అందుకుంది. మైథలాజికల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ నటించాడు. ఈ మూవీలో హనుమంతుడి రుధిరం ద్వారా శక్తులు వచ్చిన యువకుడిగా తేజ కనిపించాడు.

ఈ ఈ కాన్సెప్ట్ సినిమా రూ. రూ. 300 కోట్లు వసూల్ చేసింది. మైథలాజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ మొదలు పెడితే.. ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్ ఎండ్ లో కల్కి సినిమాతో భారీ హిట్ టాలీవుడ్ కు దక్కింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. భారీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ నటించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు.

కల్కి సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ తన నటనతో ప్రేక్షకులను అలరించింది. అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా రూ. 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమా కూడా మైథలాజికల్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమా మహాభారతం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ఇలా ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్ మొదటి బ్లాక్ బస్టర్ మైథలాజికల్ మూవీ.. అలాగే ఫస్ట్ ఆఫ్ ఎండ్ కూడా మైథలాజికల్ మూవీ కావడం విశేషం. ఇక ఈ సినిమా రానున్న రోజుల్లోనూ భారీ వసూళ్లు రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.