Allari Naresh: ‘బచ్చలమల్లి’తో వివాదంలో చిక్కుకున్న అల్లరి నరేష్.. ఇప్పుడు ఏం చేస్తారో

సంక్రాంతికి వచ్చిన 'నా సామిరంగ' సినిమాలో అల్లరి నరేష్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత చేసిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా రిజల్ట్ కూడా తేడా కొట్టింది. దీంతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి 'బచ్చలమల్లి' అనే మాస్ సినిమా చేస్తున్నారు అల్లరి నరేష్.

Allari Naresh: 'బచ్చలమల్లి'తో వివాదంలో చిక్కుకున్న అల్లరి నరేష్.. ఇప్పుడు ఏం చేస్తారో
Allari Naresh in Bachhala Malli
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 01, 2024 | 12:35 PM

అల్లరి నరేష్ నటించిన.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా పరాజయం పాలయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారి ‘బచ్చలమల్లి’ అంటూ పక్కా మాస్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. తాజాగా నరేష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా గ్లింప్స్ కూడా విడుదల అయింది. ఇందులో నరేష్ లుక్.. పుష్పలో అల్లు అర్జున్‌ను పోలి ఉందని పలువురు నెటజన్లు కామెంట్స్ పెట్టారు. నరేష్ మాస్ అవతార్ నెక్ట్స్ లెవర్ అని మరికొందరు పేర్కొన్నారు. విడుదలైన వెంటనే ఈ గ్లింప్స్ తెగ వైరల్ అయింది. అయితే గ్లింప్స్‌లోని ఓ సన్నివేశంపై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ గ్లింప్స్‌లో హీరో నరేష్ ఉదయాన్నే తన నిద్రను పాడుచేస్తూ మోగుతున్న మైకును చిరాకుతో నేలకేసి కొడతాడు. అయితే ఆ టైంలో అందులో ‘భగవద్గీత’ ప్లే అవుతూ ఉంటంది. ఈ సీన్‌పైనే పలువరు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత వినిపించే మైక్‌ను.. నేలకి విసిరికొట్టడంపై తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. గ్లింప్స్ నుంచి ఆ సీన్ తీసివేయాలని.. సినిమాలో కూడా ఉండకూడదని డిమాండ్ చేస్తున్ానరు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. హీరోతో పాటు దర్శక నిర్మాతలు హిందువలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

1990 నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో హీరో నరేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా తీసిన సుబ్బు మంగాదేవి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.  ‘హనుమాన్’ మూవీతో సక్సెస్ అందుకున్న అమృత అయ్యర్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది.  సెప్టెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.