Tollywood: ప్రెండ్షిప్ గోల్స్.. గుర్తుపట్టారా వీరిని.. సెన్సేషన్ క్రియేట్ చేసిన సెలబ్రిటీస్

డైరెక్టర్ నాగ్ అశ్విన్, హీరో విజయ్ దేవరకొండ సినిమాల్లో రాకముందు నుంచే ఫ్రెండ్స్. వారిద్దరూ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బిగ్ సెలబ్రిటీస్. కాగా వీరిద్దరికి ఉన్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Tollywood: ప్రెండ్షిప్ గోల్స్.. గుర్తుపట్టారా వీరిని.. సెన్సేషన్ క్రియేట్ చేసిన సెలబ్రిటీస్
Nag Ashwin - Vijay Devarakonda
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 01, 2024 | 12:58 PM

పురాణ కథల్లో పాయింట్లు తీసుకుని సినిమాలు తెరకెక్కించడం మాములు విషయం కాదు. ఏదైనా తేడా కొడితే.. జనాల ఓ రేంజ్‌లో రఫ్పాడిస్తారు. అయితే కేవలం రెండు సినిమాలు మాత్రమే తీసిన అనుభవం ఉన్న.. నాగ్ అశ్విన్.. పురాణ కథతో కల్కీ సినిమా తీసి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఎవరినీ హర్ట్ చేయకుండా.. తను అనుకున్న కథను తెరకెక్కించడంలో 100 శాతం సక్సెస్ అయ్యారు. ఈ సినిమా మొదలెట్టినప్పుడే పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఎందుకంటే నాగ్ అశ్విన్ సినిమాలు గత సినిమాలు.. ఎవడే సుబ్రమణ్యం, మహానటి… ప్రేక్షకులను విపరీతంగా రంజింపచేశాయి. రోటీన్ సినిమా ఫార్ములాలకు భిన్నంగా సినిమాలు తీసి.. తనకంటూ సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ డైరెక్టర్.. కల్కీతో తన మెచురూటీ స్థాయి, మేకింగ్ స్టామినా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాడు.

కల్కీ మూవీతో ట్రెండింగ్‌లోకి వచ్చిన లైఫ్ స్టైల్, లవ్ స్టోరీ, బ్యాగ్రౌండ్ తెలుసుకునేందుకు అందరూ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ పాత ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో నాగ్ అశ్విన్ లుక్ చూసి జనాలు స్టన్ అవుతున్నారు. ఈ ఫోటోలో నాగీతో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఈ ఫోటోలో నాగీ చాలా సన్నగా.. పొడవాటి జుట్టు, ఫ్రెంచ్ స్టైల్ గడ్డంతో ఉన్నాడు. విజయ్ కూడా చార్మింగ్ లుక్‌లో మెరిసిపోతున్నాడు. అయితే వీరిద్దరూ సినిమాల్లోకి రాకముందే ఫ్రెండ్స్ అట. కాగా నాగ్ అశ్విన్ తీసిన మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యంలో విజయ్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. రెండో సినిమా మహానటిలోనూ అతనికి మంచి రోల్ ఇచ్చాడు. ఇప్పుడు కల్కిలోనూ అర్జునుడి పాత్రలో విజయ్ కనిపించారు. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఫ్రెండ్షిప్ గోల్స్ అంటే ఇలా ఉండాలి అని కామెంట్స్ పెడుతున్నారు.