Tollywood: ఈమె ఎవరో గుర్తుపట్టారా..? కనీసం గెస్ చేయగలరా..? ఓ తెలుగు కల్ట్ మూవీలో హీరోయిన్
ఒకనాడు కుర్రాళ్లకు కలలరాణిగా వెలిగిన హీరోయిన్ ఈమె. ఆ సినిమాని, ఆమె యాక్టింగ్‌ని ఎప్పటికీ మరవలేం. తాజాగా ఈ మాజీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

కొంతమంది నటీనటులు.. మేకప్ ఉంటే ఒకలా మేకప్ లేకుంటే మరోలా కనిపిస్తారు. కొందర్ని అయితే బయట వితౌట్ మేకప్ గుర్తుపట్టడం కూడా కష్టమే. ముఖ్యంగా హీరోయిన్స్ పెళ్లి చేసుకుని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత.. ఒక్కసారిగా కనిపిస్తే ఈమె ఫలానా అని కనీసం గెస్ కూడా చెయ్యలేం. ఎందుకంటే కొందరు పెళ్లి తర్వాత ఫిజిక్ మెయింటైన్ చేయరు. ఫ్యామిలీపైనే పూర్తి ఫోకస్ పెడతారు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత మహిళల్లో శారీరకంగా చాలా మార్పులు వస్తాయి. అలానే పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇడియట్ మూవీ హీరోయిన్ రక్షితను మన తెలుగు జనాలు ఇప్పుడు గుర్తించలేకపోతున్నారు. ఆమె చాలా బరువు పెరిగారు. అయితేనేం ఎంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఆమె నవ్వుల్లో స్వచ్చత కనిపిస్తుంది.
చిరు, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు, జగపతి బాబు లాంటి టాప్ హీరోలతో ఆడిపాడింది రక్షిత. అటు కన్నడలో సైతం అగ్ర హీరోల సరసన నటించింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే కన్నడ దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఆమె సినిమాలకు దూరమైంది. బుల్లితెరపై పలు షోలలో మాత్రం కనిపిస్తూనే ఉంది. ఆపై బాబుకి జన్మనిచ్చిన అనంతరం ఆమె పూర్తిగా మారిపోయింది. బాగా బరువు పెరిగింది. ప్రజంట్ రక్షిత ఫోటోలు చూసినవారు.. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాటలో పొగరు చూపిన చిన్నది.. ‘చంటీ… ఐ లవ్యూ రా..’ అంటూ ఇంటెన్స్‌తో డైలాగ్ చెప్పిన కుర్రది.. ఈమేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
అయినా ఇడియట్ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటింది. అప్పుటికీ ఇప్పటికీ మనుషులు ఒకేలా ఉంటారా..?. వయసును బట్టి మార్పులు రావా..? ఇంకో విషయం ఏంటంటే ఆమె బరువు పెరగడానికి థైరాయిడే కారణమట. అంతేకానీ ఫిట్ నెస్‌పై శ్రద్ధ తీసుకోక ఏం కాదు. ఇలాంటి సమస్యలు ఉండే చాలామంది మహిళలు మన కుటుంబాల్లో, బంధువుల్లో కూడా ఉంటాయి. వారి పరిస్థితిని అర్థం చేసుకోండి. అంతేకానీ నెగటివ్ కామెంట్స్ మాత్రం చేయవద్దు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.