Tollywood: ఆమె వాలు చూపు తాకితే.. కుర్రాళ్లు హృదయాలు ఉక్కిరిబిక్కిరే… గుర్తుపట్టారా..?
ఫోటోలో కరాటే డ్రస్ లో కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. అంతేకాకుండా.. ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడం అంటే మాములు విషయం కాదు. బ్యూటీ, టాలెంట్‌తో పాటు కాస్త.. లక్ కూడా ఉండాలి. ఇక దశబ్ధాల తరబడి ఇండస్ట్రీలో రాణించడం త్రిష, నయనతార లాంటి కొందరికే దక్కుతుంది. ఫేమ్ పోకుండా ఎప్పుడూ.. స్టార్ హీరోయిన్‌గా రాణించాలంటే.. చాలా క్వాలిటీస్ ఉండాలి. ఫీమేల్ లీడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాగలగాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ కూడా ఆ కేటగిరీకి చెందినవారే. అవును.. పై ఫోటోలో కరాటే డ్రస్‌లో కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు సౌత్‌లో ఓ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో కనిపెట్టగలిగారా..?
తను మరెవరో కాదు తొలి సినిమాతోనే ప్రేమక్షుల్ని మాయ చేసిన సమంత. 2010లో నాగ చైతన్య సరసన ‘ఏ మాయ చేశావే సినిమా’తో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది ఈ బ్యూటీ. ఇక తొలి సినిమాతోనే కుర్రాళ్ల హాట్ ఫేవరెట్‌గా మారింది. సామ్ అందం, అద్భుతమైన నటనకు అందరూ ముగ్ధులయ్యారు. ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. వరస అవకాశాలతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి.. మెప్పించింది
ఇక హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. ఆ తర్వాత అభిప్రాయ బేధాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. దాని చికిత్స కోసం.. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మరోసారి మంచి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక సమంతను చాలామంది రియల్ లైఫ్ ఫైటర్ అంటుంటారు. మరి కమ్ బ్యాక్ తర్వాత ఆమె ఎలాంటి సినిమాలతో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.