AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa Teaser: ప్రభాస్ సీన్ హైలెట్.. కన్నప్ప టీజర్ అదిరిపోయింది.. వీడియో చూశారా..?

దాదాపు 150 కోట్ల బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా తాజాగా కన్నప్ప టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ టీజర్ మొత్తంలో కేవలం ప్రభాస్ కనిపించిన షాట్ మాత్రమే వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Kannappa Teaser: ప్రభాస్ సీన్ హైలెట్.. కన్నప్ప టీజర్ అదిరిపోయింది.. వీడియో చూశారా..?
Kannappa
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2024 | 5:25 PM

Share

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. అత్యధిక బడ్జె్ట్‏తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్ అడవులతోపాటు.. రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా తాజాగా కన్నప్ప టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ టీజర్ మొత్తంలో కేవలం ప్రభాస్ కనిపించిన షాట్ మాత్రమే వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

టీజర్ మొత్తంలో కొన్ని షాట్స్ చూస్తుంటే ఈసారి సినీ ప్రియులకు విజువల్ ట్రీట్ మాత్రం పక్కా అనిపిస్తుంది. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. కానీ తాజాగా విడుదలైన టీజర్ లో మాత్రం అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ కళ్లను చూపిస్తూ ఓ షాట్ వేసారు. అలాగే కన్నప్ప వీరుడిగా కనిపించనున్నాడు. యుద్ధ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్ తో టీజర్ అదిరిపోయింది. దీంతో ఫుల్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కన్నప్ప టీజర్ వైరలవుతుంది. ఇక ఇందులో డార్లింగ్ ఐ షాట్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల తర్వాత వచ్చే నెల నుంచి ప్రతీ సోమవారం ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వస్తుందని.. ఇకపై కన్నప్ప సోమవారం అవుతుందని మంచు విష్ణు అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!
స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!
Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!
Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!
టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?
టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌
తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌
ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!
ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!