Prashanth Neel: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సోదరుడు ఏపీలో పెద్ద రాజకీయ నేత అని తెల్సా..?
KGF, KGF 2, సలావ్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మన తెలుగువారు. ముఖ్యంగా రాయలసీమ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వారు. ఆయనకు ఆంధ్రాలోని ఓ సినియర్ కాంగ్రెస్ నేత సోదరుడు అవుతారు.. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి...

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్‌లో స్టార్ హీరోలు సినిమా తీయాలనుకునే.. ఎంపిక చేసుకునే దర్శకుల లిస్ట్‌లో ముందు వరసలో ఉంటాడు ప్రశాంత్ నీల్. యష్ హీరోగా హోంబలే ఫిలింస్ పతాకంపై ఆయన తీసిన KGF సీరిస్ సంచలన విజయం సాధించింది. ప్రతి సీన్ బిల్డప్ సీన్‌లా హై ఓల్టేజ్ యాక్షన్ తరహాలో తెరకెక్కించిన వ్యక్తి డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రెండో సినిమాకే ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అనే ఇమేజ్‌ను దక్కించుకున్నారు. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల సినిమా అంటే పెద్ద గొప్ప. కానీ కేజీఎఫ్ సినిమాతో నూతన ఒరవడి సృష్టించాడు.. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపారు. ‘కేజీఎఫ్ 2’ రూ. 800 కోట్లకు పైగా వసూలు చేయగా.. ఒక్క హిందీలోనే రూ. 321 కోట్లను కొల్లగొట్టింది. ఇక ప్రభాస్‌తో సలార్ సినిమా తీసి.. అంతే స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. సలార్ పార్ట్ 2 కూడా కన్ఫామ్ చేశారు. దీని షూటింగ్ త్వరలో స్టార్టయ్యే అవకాశం ఉంది.
నిజానికి ప్రశాంత్ నీల్ తెలుగు వ్యక్తి. అందులోనూ రాయల సీమ బిడ్డ. ఇంట్రస్టింగ్ విషయమేమంటే.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి ప్రశాంత్ నీల్‌కు స్వయానా అన్న అవుతారట. ఈ విషయం KGF 2లో ఇనాయత్ ఖలీల్ పాత్ర పోషించిన బాలకృష్ణ గతంలో కన్ఫామ్ చేశారు. రఘవీరా రెడ్డి తండ్రి.. ప్రశాంత్ నీల్ తండ్రి సొంత బ్రదర్స్ అట. ప్రశాంత్ నీల్ తండ్రి దివంగత సుభాష్.. చాలా ఏళ్ల క్రితం బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వీలున్నప్పుడల్లా సత్యసాయి జిల్లా మడకశిరలోని నీలకంఠాపురంకు సుభాష్, ప్రశాంత్ నీల్ వస్తుండేవారు. నీలకంఠాపురం అనే తమ ఊరి పేరునే ఇంటి పేరుగా వారు పెట్టుకున్నారు. అయితే గ్రామం పేరుని పూర్తిగా కాకుండా నీల్ అని పెట్టుకున్నారట. ప్రశాంత్ నీల్ గ్రామానికి చాలా సార్లు వచ్చేవారని, కానీ చాలా సింపుల్‌గా ఉంటారని గ్రామస్థులు చెబుతుంటారు. కాగా గతంలో నీలకంఠపురంలో ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు ప్రశాంత్ నీల్.
నీలకంఠాపురం దేవస్థానములు సందర్శించి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న ప్రముఖ దర్శకుడు రఘువీరారెడ్డి గారి అన్న కుమారుడు @prashanth_neel pic.twitter.com/uggpSGFe7j
— NKP Devasthanams (@nkpdevasthanam) August 15, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.