Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అభిమానుల గుండెల్లో చెరగని రూపం.. ఒక్క సినిమాతోనే సంచలనం సృష్టించిన హీరో.. ఎవరో తెలుసా..?

హీరోగా ప్రేక్షకులకు అలరించి.. చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి అభిమానుల హృదయాలకు ఎప్పటికీ తీరని బాధను మిగిల్చాడు. ఇప్పటికీ వీడని మిస్టరీ అతడి మరణం. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ఆరోపణలు.. న్యాయం కోసం పోరాటం చేస్తున్న కుటుంబం. నటనే ప్రాణమనుకున్నా కుర్రాడు చివరకు సినిమా కారణంగానే ప్రాణం తీసుకున్నాడు.

Tollywood: అభిమానుల గుండెల్లో చెరగని రూపం.. ఒక్క సినిమాతోనే సంచలనం సృష్టించిన హీరో.. ఎవరో తెలుసా..?
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 14, 2024 | 6:40 PM

ఒక్క సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హీరో. నటనపై ఆసక్తితో ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అద్భుతమైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నాడు. ఈ కుర్రాడు నటించిన సినిమాలు థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టాయి. కానీ కఠిన పరిస్థితులకు తలవంచి ప్రాణాలను వదిలేశాడు. హీరోగా ప్రేక్షకులకు అలరించి.. చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి అభిమానుల హృదయాలకు ఎప్పటికీ తీరని బాధను మిగిల్చాడు. ఇప్పటికీ వీడని మిస్టరీ అతడి మరణం. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ఆరోపణలు.. న్యాయం కోసం పోరాటం చేస్తున్న కుటుంబం. నటనే ప్రాణమనుకున్నా కుర్రాడు చివరకు సినిమా కారణంగానే ప్రాణం తీసుకున్నాడు. ఈరోజు ఆ కుర్రాడు మరణించిన రోజు. అతడి అభిమానులకు ఈరోజు (జూన్ 14) బ్లాక్ డే. ఇంతకీ అతడు ఎవరో గుర్తుకు వచ్చిందా.. అవును.. అతడే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.

2020 జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు. అతడు మరణించిన నాలుగు సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. సుశాంత్ ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సినీ పరిశ్రమలో ఒత్తడి కారణంగానే అతడు సూసైడ్ చేసుకున్నాడని అధికారులు వాధించారు. కాదు బాలీవుడ్ రాజకీయాలే కారణమని.. ఆత్మహత్య కాదు.. హత్య అంటూ వాదిస్తున్నారు కుటుంబసభ్యులు, అభిమానులు. ఇప్పటికీ వీడని మిస్టరీ సుశాంత్ మరణం. ఈరోజు సుశాంత్ మరణించిన రోజు కావడంతో తమ అభిమాన నటుడిని గుర్తుచేసుకుంటూ సుశాంత్ త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

సుశాంత్ బీహార్ రాజధాని పాట్నాలో పెరిగాడు. ఇద్దరు అక్కలకు ముద్దుల తమ్ముడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి. అయినా చదువులో టాపర్. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలో 7వ ర్యాంక్ సాధించాడు. కానీ నటనపై ఇష్టంతో సినీ రంగుల ప్రపంచం వైపు అడుగులు వేశాడు. మొదట్లో గ్రూప్ డ్యాన్సర్ . ఆ తర్వాత కిస్ దేశ్ మే హై మేరా దిల్ సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ. పవిత్ర రిష్తా సీరియల్లో హీరోగా కనిపించి పాపులర్ అయ్యాడు. ఈ సీరియల్ తర్వాత పలు రియాల్టీ షోలలో కనిపించి.. 2013లో కాయ్ పో చే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. శుద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, డిటెక్టివ్ బ్యోమకేష్, బక్షి, ఎంస్ ధోని, దిల్ బేచార, చిచోరే చిత్రాల్లో నటించాడు. ఎంఎస్ ధోని సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.