- Telugu News Photo Gallery Cinema photos Reasons behind bollywood movies are not performing well at box office
Bollywood News: కరోనా నుంచి ఇంకా బయటపడని బాలీవుడ్.. కనీస బుకింగ్స్ కూడా లేని సినిమాలు
బాలీవుడ్ ఆడియన్స్ సినిమాలు చూడటం మానేసారా..? లేదంటే థియేటర్స్‌లో చూడటం ఆపేసారా..? స్టార్ హీరోల సినిమాలకు కూడా కనీస బుకింగ్స్ ఎందుకు ఉండట్లేదు..? కరోనా ఎఫెక్ట్ బాలీవుడ్‌పై ఇంకా కనిపిస్తుందా..? అదీ కాదంటే ఓటిటి కారణంగా కలెక్షన్లు రావట్లేదా..? అసలు సమస్య ఎక్కడుంది..? అసలేం జరుగుతుంది..? దీనిపై నిర్మాతలు ఏమంటున్నారు..? ప్రపంచమంతా కరోనా నుంచి బయటపడింది ఒక్క బాలీవుడ్ తప్ప. అదేంటి అలా అంటున్నారు.. ఇంకెక్కడి కరోనా అనుకోవచ్చు..!
Updated on: Jun 14, 2024 | 6:57 PM

బాలీవుడ్ ఆడియన్స్ సినిమాలు చూడటం మానేసారా..? లేదంటే థియేటర్స్‌లో చూడటం ఆపేసారా..? స్టార్ హీరోల సినిమాలకు కూడా కనీస బుకింగ్స్ ఎందుకు ఉండట్లేదు..? కరోనా ఎఫెక్ట్ బాలీవుడ్‌పై ఇంకా కనిపిస్తుందా..? అదీ కాదంటే ఓటిటి కారణంగా కలెక్షన్లు రావట్లేదా..? అసలు సమస్య ఎక్కడుంది..? అసలేం జరుగుతుంది..? దీనిపై నిర్మాతలు ఏమంటున్నారు..?

ప్రపంచమంతా కరోనా నుంచి బయటపడింది ఒక్క బాలీవుడ్ తప్ప. అదేంటి అలా అంటున్నారు.. ఇంకెక్కడి కరోనా అనుకోవచ్చు..! కానీ బాలీవుడ్ దర్శక నిర్మాతల ఆలోచన ఇంకా అక్కడే ఆగిపోయింది. ఆడియన్స్ కూడా వాళ్లకు తగ్గట్టుగానే ఆలోచిస్తున్నారు. అందుకే 2024లోనూ నేరుగా ఓటిటిలోనే విడుదలవుతున్నాయి కొన్ని సినిమాలు.. థియేటర్‌లో వచ్చిన సినిమాలకేమో ఓపెనింగ్స్ రావట్లేదు.

మొన్నటికి మొన్న స్వాంతంత్య్ర నేపథ్యంలో తెరకెక్కిన ఏ వతన్ మేరే వతన్ సినిమా నేరుగా ఓటిటిలోనే వచ్చింది. సారా అలీ ఖాన్‌తో పాటు చాలా మంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు ఈ సినిమాలో.

దానికి ముందు షాహిద్ కపూర్ బ్లడీ డాడీ.. సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను.. వరుణ్ ధవన్ భవాల్.. ఇషాన్ ఖట్టర్ పిప్పా లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ కాకుండా ఓటిటిలోనే వచ్చాయి.

కార్తీక్ ఆర్యన్ హీరోగా కబీర్ ఖాన్ తెరకెక్కించిన చందూ ఛాంపియన్ జూన్ 14న రానుంది. పారా ఒలింపిక్‌లో బంగారు పతకం సాధించిన మురళీకాంత్ పెట్కర్ బయోపిక్ ఇది. భారీబడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి ప్రమోషన్స్ బానే చేశారు.. కానీ ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. బుకింగ్స్ కనీసం 5 కోట్లు కూడా లేవు. ఇదంతా చూస్తుంటే థియేటర్స్ వైపు రావడానికి కూడా ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదని అర్థమవుతుంది.




