- Telugu News Photo Gallery Cinema photos Ananya Pandey latest gorgeous pictures goes viral in social media
Ananya Pandey: ఈ ముద్దుగుమ్మా సొగసుకి ఫిదా అయినా అందం.. ఈమెను మనువాడ దలచిందేమో..
అనన్య పాండే ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా బాలీవుడ్ చిత్రాలలో పని చేస్తుంది. నటుడు చుంకీ పాండే కుమార్తె, ఆమె 2019లో టీన్ ఫిల్మ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు కామెడీ పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఈ ప్రదర్శనలు ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టాయి. ఆమె తర్వాత వచ్చిన రెండు చిత్రాలు ఆదరణ పొందాయి, అయితే ఆమె కామెడీ డ్రీమ్ గర్ల్ 2 , గెహ్రైయాన్, ఖో గయే హమ్ కహాన్ లో ఆమె నటనకు మంచి ఆదరణ లభించింది.
Updated on: Jun 14, 2024 | 4:12 PM

30 అక్టోబర్ 1998న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై నగరంలో జన్మించింది అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే. ఈ వయ్యారి తండ్రి చుంకీ పాండే కూడా బాలీవుడ్ నటుడు, తల్లి భావన పాండే కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

ఆమెకు రైసా అనే చెల్లెలు ఉంది. తాత శరద్ పాండే హార్ట్ సర్జన్. మామ చిక్కి పాండే వ్యాపారవేత్త, అత్త డీన్నే పాండే వెల్నెస్ కోచ్. ముంబైలోని ప్రముఖ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల నుంచి డిగ్రీ వరకు చదువుకుంది ఈ వయ్యారి భామ.

టైగర్ ష్రాఫ్, తారా సుతారియా జంటగా నటించిన హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో చలన చిత్ర అరంగేట్రం చేసింది. తర్వాత పతి పత్నీ ఔర్ వోలో కార్తీక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్‌లతో కలిసి 1978లో వచ్చిన ది సమె నేమ్ చిత్రం రీమేక్‌లో కనిపించింది.

2020లో ఇషాన్ ఖట్టర్ సరసన యాక్షన్ చిత్రం ఖాలీ పీలీలో కథానాయకిగా నటించింది. తర్వాత 2022 గెహ్రైయాన్ లో కనిపించింది. అదే ఏడాది విజయ్ దేవరకొండకి జోడిగా లైగర్ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయింది ఈ అందాల భామ.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటు అభిమానాలు ఖుషి చేస్తుంది ఈ వయ్యారి భామ. ఇప్పుడు కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలను చూసిన అనన్య ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.




