- Telugu News Photo Gallery Cinema photos Pawan kalyan latest movie update from og Ustaad Bhagat Singh hari hara veeramallu
Pawan Kalyan: సినిమాలకు డెడ్‌లైన్ ఫిక్స్ చేసిన పవన్.. ఆసక్తికరంగా నయా అప్‌డేట్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి తగ్గింది. దీంతో పొలిటికల్ డిస్కషన్ పక్కన పెట్టేసిన పవన్ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలే నాలుగు ఉండటంతో అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో పవన్ ఓ నిర్ణయం తీసుకున్నారన్నది నయా అప్‌డేట్. పవన్‌ను అసెంబ్లీలో చూడాలన్న అభిమానుల కల త్వరలో నెరవేరబోతోంది. ఇక సినిమాల విషయంలోనే క్లారిటీ కావాలంటున్నారు ఫ్యాన్స్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jun 14, 2024 | 7:34 PM

ఈ సారి మరో స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే స్పెషల్‌గా ఓజి ఫస్ట్ సింగిల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. టీజర్‌లో వచ్చిన హంగ్రీ ఛీతా సాంగ్ వైరల్ అయింది. టీజర్ వచ్చి ఏడాదైనా ఇప్పటికీ ఆ పాట పవర్ తగ్గలేదు.

పవన్ ఇచ్చిన ఈ స్టేట్మెంటే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు డిసెంబర్ బరిలో పవర్ స్టార్ కూడా ఉంటారన్న ప్రచారం జరిగింది. ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ఎప్పుడో చెప్పారు మేకర్స్.

ఇప్పుడు ఎన్నికల హడావిడి ముగియటంతో సినిమాల మీద ఫోకస్ చేయబోతున్నారు పవన్. ఆరు నెలల పాటు ఎక్కువ సమయం సినిమాలకే కేటాయించేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఈ టైమ్‌లో ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలకు సంబంధించి, తన వర్క్ అంతా ఫినిష్ చేసేలా ప్లాన్ చేయాలని మేకర్స్‌కు క్లారిటీ ఇచ్చేశారు.

ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న హరీష్.. అప్పటికి కాసింత ఖాళీ చేసుకుని, స్క్రిప్ట్ ని మరోసారి సరిచూసుకుని.. రెడీ బాస్ అనడానికి సమయం సరిగ్గా సరిపోతుంది.

వన్స్ సినిమాలకు సంబంధించిన పనులు పూర్తయితే ఇక పూర్తి స్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయించవచ్చని భావిస్తున్నారు పవన్. ఇప్పటికే పవన్ సినిమాలు వరుసగా వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అందుకే అభిమానులు నిరీక్షణకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పెట్టేయాలని భావిస్తున్నారు పవర్ స్టార్.





























