Telugu Indian Idol: ‘ఆహా’ అనిపించేలా తెలుగు ఇండియన్ ఐడల్ 3
తొలి రెండు సీజన్లు ఘన విజయం సాధించటంతో థర్డ్ సీజన్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేసింది ఆహా. ఈ సారి ఏకంగా విదేశాల్లోనూ ఆడిషన్స్ నిర్వహించారు. న్యూ జెన్సీ, డల్లాస్ లాంటి చోట్ల ఏర్పాటు చేసిన ఆడిషన్స్‌కు ఎన్నారైలు క్యూ కట్టారు. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ తెలుగు ఇండియన్ ఐడల్ రెండు సీజన్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమ గొంతు వినిపించేందుకు ఎన్నారైలు కూడా పోటి పడ్డారు.
Updated on: Jun 14, 2024 | 8:09 PM

తొలి రెండు సీజన్లు ఘన విజయం సాధించటంతో థర్డ్ సీజన్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేసింది ఆహా. ఈ సారి ఏకంగా విదేశాల్లోనూ ఆడిషన్స్ నిర్వహించారు. న్యూ జెన్సీ, డల్లాస్ లాంటి చోట్ల ఏర్పాటు చేసిన ఆడిషన్స్‌కు ఎన్నారైలు క్యూ కట్టారు.

మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ తెలుగు ఇండియన్ ఐడల్ రెండు సీజన్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమ గొంతు వినిపించేందుకు ఎన్నారైలు కూడా పోటి పడ్డారు. ఆడిషన్స్‌లో వేల మంది యువతి యువకులు పాల్గొన్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్ వేదిక మీద ఒక్కసారైనా తమ గొంతు వినిపించాలని ఎంతో మంది విదేశాల్లో స్థిరపడ్డవారు ఆశపడుతున్నారు. కానీ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సీజన్ 3 ఆడిషన్స్‌కు పెద్ద సంఖ్యలో యువ గాయనీ గాయకులు హాజరయ్యారు.

తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సంగీత ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు ఆహర్నిషలు శ్రమిస్తోంది ఆహా టీమ్. ది బెస్ట్ సింగర్స్‌ను ఐడెంటిఫై చేసేందుకు వేల మంది గాయనీ గాయకులను ఒడపోసింది. 37 దేశాల్లో 15 వేల మందిని ఆడిషన్ చేశారు. ఫైనల్‌గా అత్యుత్తమ సింగర్స్‌తో సీజన్ 3 పోటి మరింత ఆసక్తికరంగా సాగనుంది.

జూన్ 14 నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహాలో స్ట్రీ కానుంది. ప్రతీ శుక్ర, శనివారాల్లో కొత్త ఎపిసోడ్స్ అలరించబోతున్నాయి. గత సీజన్లను సూపర్ హిట్ కావటంతో థర్డ్ సీజన్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను మించి వినోదాన్ని అందించబోతోంది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.




