Allu Arjun: మరో బ్లాక్ బస్టర్ లోడింగ్.. త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా స్టోరీ ఇదేనా..
ఇటీవలే రిలీజ్ చేసిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొత్త సీన్లను చూడడానికే ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పటికీ పుష్ప 2 థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇక ఈ విషయం పక్కకు పెడితే.,. పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు రెండు నెలలు కావస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ గురించే మాట్లాడుకుంటున్నారు. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు మన ఐకాన్ స్టార్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2021లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్నో నమోదు చేసుకుంది. రక్ష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక రీసెంట్ గా పుష్ప 2తో మరోసారి ఇండియాను షేక్ చేశారు సుకుమార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు ఏకంగా రూ.18కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2తో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారిపోయాడు.
అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. కాగా పుష్ప 3 సినిమా కూడా ఉంటుందని సుకుమార్ హింట్ ఇచ్చాడు. పుష్ప 2 ఎండ్ లో పుష్ప 3 హింట్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. అటు అల్లు అర్జున్ కూడా పుష్ప 3 అంటే వామ్మో అనేశాడు. అయితే పుష్ప 2 తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగోసారి ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ ఇదే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో శివుడి తనయుడు కార్తికేయుడి కథతో సినిమా చేయడానికి గురూజీ రెడీ అయ్యారని అంటున్నారు. యుద్ధ దేవుడిగా పిలవబడే కార్తికేయ జర్నీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. తన తండ్రి పరమేశ్వరుడిని తిరిగి కలవడానికి బయలుదేరిన కార్తికేయుడి ప్రయాణం ఎలా జరిగిందనే కథతో ఈ సినిమా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట త్రివిక్రమ్. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




