AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాందేవ్ 25 ఏళ్ల కష్టానికి నిదర్శనమే ఈ ఎక్స్ పీరియం పార్క్ : మెగాస్టార్ చిరంజీవి

చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

రాందేవ్ 25 ఏళ్ల కష్టానికి నిదర్శనమే ఈ ఎక్స్ పీరియం పార్క్ : మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Jan 28, 2025 | 5:12 PM

Share

చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రయక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘రాందేవ్‌తో నా పరిచయం ఇప్పటిది కాదు. ఈ ఎక్స్‌పీరియం పార్కుని మీ అందరి కంటే ముందుగా నేను చూశాను. 2000వ సంవత్సరంలోనే దీని గురించి రాందేవ్ నాతో పంచుకున్నారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూనే ఉన్నాను. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. రాందేవ్‌ ఓ వ్యాపారవేత్తగా ఎప్పుడూ ఆలోచించరు. పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచిస్తుంటారు. ఈ 150 ఎకరాలను వాణిజ్యంగానూ వాడుకోవచ్చు. కానీ ఆయన ఈ 25 ఏళ్లుగా రకరకాల మొక్కల్ని, వివిద దేశాల నుంచి కొత్త జాతి మొక్కల్ని ఇక్కడకు తీసుకొచ్చి ఈ పార్కుని నిర్మించారు. ఈ రకంగా రాం దేవ్ ఓ మంచి ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు.

ఈ ఎక్స్‌పీరియం పార్కుని చూసి నేను, గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు షాక్ అయ్యాం. ఇంత అద్భుతంగా ఉన్న ఈ పార్కుని చూసి షూటింగ్‌కు ఇస్తారా? అని రాం దేవ్‌ను అడిగాను. ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే అయితే ఇస్తామని అన్నారు. కానీ ఈ ఎండలో నేను ఇక్కడ హీరోయిన్‌తో స్టెప్పులు వేయడం అంటే కాస్త కష్టమే. వర్షా కాలం తరువాత ఇక్కడ మరింత గ్రీనరి వస్తుందని ఆ టైంలో షూటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. వెడ్డింగ్, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలకు ఈ చోటు అనువైనదిగా ఉంటుంది. దేశవిదేశాల్లో ఉండే ఎన్నో అరుదైన జాతి మొక్కల్ని ఒక చోటకు చేర్చి ఇంత అద్భుతమైన పార్కుని రాం దేవ్ నిర్మించారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం అభినందనీయం. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి ప్రకృతి, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకు రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలు.. అలప్పుజా–బెంగళూరు మధ్య..
విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలు.. అలప్పుజా–బెంగళూరు మధ్య..
హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం..జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్
హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం..జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్
మరో ఫోక్ డాన్సర్‌తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి..
మరో ఫోక్ డాన్సర్‌తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి..
చికెన్ కర్రీ ఒక్కసారి ఇలా చేసి ఇంట్లోవాళ్లకు పెట్టండి..
చికెన్ కర్రీ ఒక్కసారి ఇలా చేసి ఇంట్లోవాళ్లకు పెట్టండి..
ఆర్‌బీఐ సరికొత్త నిబంధనలు.. మారనున్న హోం, పర్సనల్ లోన్స్ ఈఎంఐలు..
ఆర్‌బీఐ సరికొత్త నిబంధనలు.. మారనున్న హోం, పర్సనల్ లోన్స్ ఈఎంఐలు..
అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్‌, మోహన్‌లాల్‌
అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్‌, మోహన్‌లాల్‌
మ్యూజిక్ వరల్డ్‌ను షేక్‌ చేసిన ఏకైక పాట.. ఏకంగా 600 కోట్ల వ్యూస్!
మ్యూజిక్ వరల్డ్‌ను షేక్‌ చేసిన ఏకైక పాట.. ఏకంగా 600 కోట్ల వ్యూస్!
బోనాలు.. ట్రోలింగ్‌పై ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో వైరల్!
బోనాలు.. ట్రోలింగ్‌పై ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో వైరల్!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ రాశులకు కెరీర్, ఆర్థికంగా కలిసొచ్చే కాలం!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ రాశులకు కెరీర్, ఆర్థికంగా కలిసొచ్చే కాలం!
విరాట్ జెర్సీ నంబర్ 18 వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే
విరాట్ జెర్సీ నంబర్ 18 వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే