AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iBOMMA: ‘ఐ బొమ్మ’ను మూసేస్తున్నాం అంటూ ప్రకటన.. మీమ్స్‌తో రచ్చ చేస్తోన్న నెటిజన్లు

Ibomma: నిన్నమొన్నటి వరకు సినిమా చూడాలంటే థియేటర్ ముందు క్యూ కట్టేవారు ఫిల్మీ లవర్స్. ఆఫ్టర్ కరోనా.. ఓటీటీలంటూ ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. కాని నౌ.. సబ్‌స్క్రిప్షన్ బాదుడు తట్టుకోలేక..

iBOMMA: 'ఐ బొమ్మ'ను మూసేస్తున్నాం అంటూ ప్రకటన.. మీమ్స్‌తో రచ్చ చేస్తోన్న నెటిజన్లు
Ibomma
Phani CH
|

Updated on: Jul 07, 2022 | 6:42 PM

Share

నిన్నమొన్నటి వరకు సినిమా చూడాలంటే థియేటర్ ముందు క్యూ కట్టేవారు ఫిల్మీ లవర్స్. ఆఫ్టర్ కరోనా.. ఓటీటీలంటూ ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. కాని నౌ.. సబ్‌స్క్రిప్షన్ బాదుడు తట్టుకోలేక.. రెంటెడ్‌ కాన్సెప్ట్ కు కట్టుబడలేక.. ఐబొమ్మ వైపే చూస్తున్నారు. చాలా ఫ్రీగా.. హెచ్‌డీ ఫార్మాట్‌లో తెలుగు కంటెట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అన్‌ అఫిషియల్.. అఫీషియల్‌ ఫిల్మీ సైట్‌గా దాన్ని మార్చేశారు. పిచ్చ పిచ్చ గా క్రేజ్‌ పెంచారు.. అటు వైరల్ ఇటు ట్రోల్‌ రెండూ చేస్తూ వచ్చారు. చివరాఖరికి వారికి కోపం కూడా వచ్చేలా చేశారు. అవును ! ఐబొమ్మ యాజమాన్యానికి తాజాగా కోపం వచ్చింది. వారి మీద వస్తున్న ట్రోల్స్ చూసి.. చాలా సీరియస్ గా రియాక్టయ్యారు వారు. రియాక్టవడమే కాదు.. తన వెబ్‌సైట్ పేజీలో ఓ పెద్ద నోట్‌ నే పోస్ట్ చేశారు. మా వెబ్‌ సర్వర్ ను షెట్‌డౌన్ చేస్తున్నాం అంటూ.. రెడ్‌ కలర్‌లో బిగ్‌ ఫాంట్‌తో పబ్లిష్ చేశారు. దానికి రీజన్ ఏంటో… ఆ లైన్ కిందే రాసుకొచ్చారు ఐ బొమ్మ వారు.

99.999% అప్‌ టైంతో క్లౌడ్‌ సర్వర్‌ ను మెయిన్ టెయిన్ చేయడం అంత ఈజీ కాదంటూ.. ఫ్లాంక్‌ గా చెప్పిన ఐబొమ్మ టీంమెంబర్స్ .. తమ కష్టాన్ని మాత్రం ఎవరూ గుర్తించడం లేదంటూ.. ఫీలయ్యారు. డబ్బులు రాకపోయినా.. సర్వర్, బ్యాండ్ విడ్త్‌ కాస్ట్‌పెరిగిపోతున్నా,.. సైట్‌ మేనేజ్‌ చేస్తున్నమన్నారు. కాని సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు తమను నొచ్చుకునేలా చేస్తున్నాయన్నారు. ఐబొమ్మ సైట్లలో మాల్వేర్ అటాచ్‌ చేసి.. ఫోన్లో పర్సనల్ డాటాను దొంగిలిస్తున్నారని..ఆ డాటాను కంపెనీలకు అమ్మి.. చాలా డబ్బు సంపాదిస్తున్నారని ప్రచారం చేయడాన్ని ఐబొమ్మ వారు తమ రీజన్లో కొట్ చేశారు. దానికి తోడు సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కూడా వారిని బాధపడేలా చేసిందని అన్నారు.

కాని మా హార్డ్‌ వర్క్‌ గురించి ఎవరూ ఆలోచించడం లేదన్నారు. ఈ సైట్‌ మీద తాము సంపాదించింది జీరో అని… తిరిగి ఈ సైట్ కోసం పెట్టిన ఖర్చే ఎక్కువని.. కేవలం పాషన్ తోనే ఇదంతా చేస్తున్నామని.. చెప్పే ప్రయత్నం చేశారు ఐబొమ్మ టీం మెంబర్స్. ఇక ఐబొమ్మ తమ సైట్లో పబ్లిష్ చేసిన నోట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీమ్స్‌ కు నయా ఫీడ్‌గా మారుతోంది. ఐబొమ్మ బ్రో ఫీల్ అవకు బ్రో.. నువ్వు మావోని బ్రో.. అనే కామెంట్లు కూడా పాపులర్ అవుతున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

Follow Us