Ram Charan’s RC15: కామన్‌ పాయింట్స్‌కు పదును పెడుతున్న శంకర్‌ – చెర్రీ.. ఇక థియేటర్స్ షేక్ కావాల్సిందే..

RC15 Movie Latest Update: ఒక్కొక్కరినీ కాదు షేర్‌ ఖాన్‌.. వంద మందినీ ఒకేసారి రమ్మను అంటూ కెరీర్‌ స్టార్టింగ్‌లో తన పంచ్ పవర్ చూపించిన మెగా పవర్ స్టార్‌ రాంచరణ్...

Ram Charan's RC15: కామన్‌ పాయింట్స్‌కు పదును పెడుతున్న శంకర్‌ - చెర్రీ.. ఇక థియేటర్స్ షేక్ కావాల్సిందే..
Shankar , Ram Charan
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 07, 2022 | 3:01 PM

Ram Charan and Shankar’s Movie: వంద మందిని ఒకేసారి రమ్మనేంత దమ్మున్న హీరో… వెయ్యి మంది ఫైట్‌ సీక్వెన్స్ ప్లాన్ చేసే క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్‌. ఈ కాంబినేషన్‌లో మూవీ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ను ఆడియన్స్‌కు ఇచ్చేందుకు రెడీ అవుతోంది RC 15 టీమ్. ఒక్కొక్కరినీ కాదు షేర్‌ ఖాన్‌.. వంద మందినీ ఒకేసారి రమ్మను అంటూ కెరీర్‌ స్టార్టింగ్‌లో తన పంచ్ పవర్ చూపించిన మెగా పవర్ స్టార్‌ రాంచరణ్… రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఏకంగా రెండు వేల మందితో తలపడి మరోసారి సత్తా చాటారు. అందుకే నెక్ట్స్ సినిమాల్లో చెర్రీ ఎలివేషన్‌ అంతకు మించి ఉండేలా చూసుకుంటున్నారు డైరెక్టర్స్‌.

ప్రజెంట్ గ్రేట్ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో చెర్రీ ఓ సినిమా చేస్తున్నారు. డైరెక్ట్ తెలుగులో శంకర్ చేస్తున్న తొలి మూవీ ఇది.  దాదాపు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్ యాక్షస్‌ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 1200 మంది ఫైటర్స్‌తో ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ను షూట్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి
Ram Charan

Ram Charan

శంకర్ గత చిత్రాల్లోనూ భారీ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కనిపించాయి. అపరిచితుడు సినిమాలో వందల మంది మార్షల్‌ ఆర్ట్స్ ప్రొఫెషనల్స్‌తో విక్రమ్ తలపడినట్టుగా శంకర్ చూపించారు. ఐ సినిమాలోనూ బాడీ బిల్డర్లతో భారీ యాక్షన్ సీక్వెన్స్‌నే తెరకెక్కించారు. ఆ సినిమాల్లో ఈ ఎపిసోడ్సే హైలెట్‌గా నిలిచాయి.

ఇప్పుడు మరోసారి తన మార్క్‌ యాక్షన్ ఎపిసోడ్‌ను చెర్రీ ఇమేజ్‌కు తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారు శంకర్‌. ఈ యాక్షన్ సన్నివేశాల్లో చెర్రీ చేసిన గత సినిమాల కంటే భారీ రేంజ్‌లో ఉండబోతుందన్న టాక్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది.  ప్రజెంట్ అమృత్‌సర్‌లో మూవీ షూటింగ్ జరుగుతోంది. ఓ కాలేజ్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. వినయ విదేయ రామ తరువాత ఈ సినిమాలో మరోసారి చెర్రీతో కియారా అద్వానీ జతకడుతున్నారు.

అటు చెర్రీ, కియారాతో 1000 మంది డ్యాన్సర్లతో కలిసి ఓ పాటను కూడా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్, సాంగ్‌తో థియేటర్స్ షేక్ కావడం ఖాయమంటున్నారు చెర్రీ ఫ్యాన్స్. డిసెంబరుకల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని శంకర్ భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?