Chiranjeevi : ఆయన విమర్శల వల్లే నా నటనలో మార్పొచ్చింది.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi)ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా మెగాస్టార్ కు భారీ అభిమాన గణం ఉంది. ఆయన డైలాగ్ డెలివరీకి, డ్యాన్స్ లకు, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవాల్సిందే.

Chiranjeevi : ఆయన విమర్శల వల్లే నా నటనలో మార్పొచ్చింది.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
Megastar Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 07, 2022 | 3:14 PM

మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi)ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా మెగాస్టార్ కు భారీ అభిమాన గణం ఉంది. ఆయన డైలాగ్ డెలివరీకి, డాన్స్ లకు, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవాల్సిందే.  ఇప్పటివరకు 152 సినిమాల్లో నటించిన చిరంజీవి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఎన్నో అవార్డులు అనుకున్నారు.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని బాస్ గా ఏలుతున్నారు చిరు. అయితే చిరంజీవి నటనలో మార్పు తీసుకుకొచ్చిన వ్యక్తి ఒకరున్నారట. ఆయన చేసిన విమర్శల వల్లే తన నటనలో మార్పు వచ్చిందని చిరు చెప్పుకొచ్చారు. మెగాస్టార్ లో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదట.. ప్రముఖ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి. శ్రీహరి ఇటీవలే అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. చిరంజీవికి అత్యంత ఆప్తుడైన గుడిపూడి శ్రీహరి మరణ వార్త విని మెగాస్టార్ దిగ్బ్రాంతికి గురయ్యారు.

సోషల్ మీడియా వేదికగా ఆయన గుడిపూడి శ్రీహరితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘గుడిపూడి శ్రీహరి గారు ఓ నిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీ విమర్శకుడు. నా ఎన్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు.. నటుడిగా నన్ను నేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోవడానికి ఎంతో ఉపకరించాయి. ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను’ అని చిరు ట్విట్‌ చేశారు. మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ తో భోళాశంకర్, బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు చిరు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమానుంచి ఫస్ట్ లు వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో ట్రేండింగ్ లో కంటిన్యూ అవుతోంది ఈ వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి