Pan India Movies: పాన్ ఇండియాపై కన్నేసిన టాలీవుడ్ కుర్ర హీరోలు.. ఆ లిస్ట్‌లో ముందున్నది వీరే..
Tallywood Young Heros: ఆల్రెడీ మార్కెట్ లెక్కలు మార్చే స్టామినా ఉందని ప్రూవ్ చేసుకున్న యంగ్ స్టార్స్... ఇప్పుడు థింక్ బిగ్.. అంటూ బిగ్ నెంబర్స్‌ను ఎయిమ్ చేస్తున్నారు.
Tollywood News: తమ అప్ కమింగ్ సినిమాలతో ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ చేస్తున్నారు టాలీవుడ్ కుర్ర హీరోలు. మంచి ఫామ్‌లో ఉన్న యంగ్ జనరేషన్ స్టార్స్ నెక్ట్స్ మూవీస్‌తో పాన్ ఇండియా ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆల్రెడీ మార్కెట్ లెక్కలు మార్చే స్టామినా ఉందని ప్రూవ్ చేసుకున్న యంగ్ స్టార్స్… ఇప్పుడు థింక్ బిగ్.. అంటూ బిగ్ నెంబర్స్‌ను ఎయిమ్ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ముందున్న యంగ్ హీరోలు ఎవరో ఓ లుక్కేయండి.
ఇస్మార్ట్ శంకర్‌తో భారీ హిట్ అందుకున్న రామ్… నెక్ట్స్ రెడ్ సినిమాతో కూడా మంచి వసూళ్లనే రాబట్టారు. అదే జోరులో మరో మాస్ యాక్షన్ డ్రామా ది వారియర్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ కోలీవుడ్ మార్కెట్ మీద రామ్ పోకస్ చేశారు. ఈ సినిమా సక్సెస్‌తో పాన్ ఇండియా ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు.
ఆల్రెడీ నార్త్ మార్కెట్‌లో బజ్ క్రియేట్ చేస్తున్న నాగచైతన్య కూడా అప్‌కమింగ్ సినిమాతో అంచనాలు పెంచేస్తున్నారు. మనం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్‌తో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అయ్యారు. ఆల్రెడీ కంప్లీట్ అయిన థాంక్యూ మూవీ రీజినల్‌గానే రిలీజ్ అవుతున్నా… వెబ్ సిరీస్ ధూత మాత్రం మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ కానుంది.
అన్న బాటలోనే పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు అక్కినేని యువ కథానాయకుడు అఖిల్. ఇంకా హీరో మెటీరియల్ అని ప్రూవ్ చేసుకునే హిట్ కెరీర్‌లో ఒక్కటి కూడా లేకపోయినా… పాన్ ఇండియా టార్గెట్‌తో బిగ్ రేంజ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఏజెంట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు అగ్ని పరీక్షలాంటిది.
యంగ్ జనరేషన్‌లో కెరీర్‌ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న మరో హీరో నిఖిల్. ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాను ఎనౌన్స్ చేసిన నిఖిల్ కూడా కార్తీకేయ 2తో తన మార్కెట్ ఎక్స్‌పాన్షన్ మీద సీరియస్‌గా ఫోకస్ చేశారు. ఈ సినిమాతో ప్రూవ్ చేసుకొని తనలో, పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసే సత్తా ఉందని ప్రూవ్ చేసే ఆలోచనలో ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి..