Sankranthi Movies: సంక్రాంతి సీజనే టార్గెట్.. తగ్గేదే లే అంటున్న మెగా హీరోలు

సినిమా ఇండస్ట్రీకి పాంగ సీజన్ వచ్చిందంటే కొత్త కళ వస్తుంది. భారీ సినిమాలన్నీ పండగలను టార్గెట్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి వస్తుందంటే చాలు.. పెద్ద పెద్ద హీరోల సినిమాలన్నీ చకచకా షూటింగ్ కంప్లీట్ చేసి డేట్ ను లాక్ చేసుకుంటూ ఉంటారు.

Sankranthi Movies: సంక్రాంతి సీజనే టార్గెట్.. తగ్గేదే లే అంటున్న మెగా హీరోలు
Mega Heros
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 07, 2022 | 3:52 PM

Sankranthi Movies: సినిమా ఇండస్ట్రీకి పండగ సీజన్ వచ్చిందంటే కొత్త కళ వస్తుంది. భారీ సినిమాలన్నీ పండగలను టార్గెట్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి వస్తుందంటే చాలు.. పెద్ద పెద్ద హీరోలు తమ సినిమాల షూటింగ్ ను చకచకా కంప్లీట్ చేసి డేట్‌ను లాక్ చేసుకుంటూ ఉంటారు. కరోనా కారణంగా ఈ సంక్రాంతికి అనుకున్నంత హంగామా జరగలేదు. దాంతో 2023 సంక్రాంతికి భారీ ప్లాన్ వేస్తున్నారు దర్శక నిర్మాతలు. బడా సినిమాలతోపాటు చిన్న సినిమాలు కూడా సంక్రాంతిని టార్గెట్ చేసి రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ సంక్రాంతి ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. ముఖ్యంగా మెగా హీరోల సినిమాలతో సంక్రాంతి ఫైట్ మరింత రంజుగా ఉండనుంది. ఇంతకు సంక్రాంతి బరిలోకి దిగుతోన్న మెగా హీరోల సినిమాలు ఏంటంటే..

మెగా కాంపౌండ్ నుంచి ముందు నేనే అంటూ సంక్రాంతి రేస్ కు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన చిరు. ఆయా సినిమాల షూటింగ్ లను చకచకా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళాశంకర్ అనే సినిమా చేస్తున్నారు చిరు. ఈ సినిమా ను సంక్రాంతికి దింపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ్ మూవీ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ కు సిస్టర్ గా మహానటి కీర్తిసురేష్ నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ నుంచి అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి కి సై అంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా సంక్రాంతికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ పాపులర్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి