Amala Paul: రెండో పెళ్లికి ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చిన అమలాపాల్.. అభిమాని ప్రశ్నకు ఆసక్తికర ఆన్సర్..
Amala Paul: మలయాళం సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార అమలాపాల్. తొలి సినిమాలో డీగ్లామర్ పాత్రలో నటించి తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ...
Amala Paul: మలయాళం సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార అమలాపాల్. తొలి సినిమాలో డీగ్లామర్ పాత్రలో నటించి తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. అనతరం తమిళంతో పాటు, పలు మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది ‘బెజవాడ’ చిత్రంతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2014లో కోలీవుడ్ డైరెక్టర్ విజయ్‌ను వివాహామాడిందీ చిన్నది. అయితే పెళ్లైన మూడేళ్లకే ఈ జంట విడాకులు తీసుకున్నారు.
ప్రస్తుతం అమలా ఒంటిరిగానే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన అమలాకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా అమలా తన రెండో పెళ్లి గురించి ప్రస్తావించింది. ‘మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి.?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన అమలాపాల్.. ‘ఇప్పుడైతే మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకుని, ఉన్నతంగా మార్చుకునే పనిలో ఉన్నాను. కాబట్టి చేసుకోబోయేవాడి అర్హతలు కూడా ఇప్పుడే చెప్పలేను. నన్ను చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో త్వరలో వెల్లడిస్తా’ అని చెప్పుకొచ్చింది. దీంతో అమలా మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram
ఇక అమలా కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం మలయాళంలో రెండు, తమిళ్‌లో ఒక చిత్రంలో నటిస్తోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పిట్టకథలు, కుడి ఎడమైతే వంటి వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంది. ఎడి ఎడమైతే వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..