AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 3 : రాకింగ్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కేజీఎఫ్ 3 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హోంబలే ఫిల్మ్స్

కన్నడ సినిమాగా వచ్చిన కేజీఎఫ్ అన్ని భాషల్లో సంచలన విజయాన్ని అందుకొని నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా తెరకెక్కింది.

KGF 3 : రాకింగ్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కేజీఎఫ్ 3 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హోంబలే ఫిల్మ్స్
Kgf3
Rajeev Rayala
|

Updated on: Jan 09, 2023 | 8:35 AM

Share

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో తన పేరు మారుమ్రోగేలా చేశారు హీరో యష్. కన్నడ సినిమాగా వచ్చిన కేజీఎఫ్ అన్ని భాషల్లో సంచలన విజయాన్ని అందుకొని నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి పార్ట్ ను మించి రెండో పార్ట్ రికార్డులను సొంతం చేసుకుంది. యశ్.. శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ మూవీ రికార్డ్స్ కొల్లగొట్టింది. పాన్ ఇండియా లెవల్లో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్‎లో చాప్టర్ గురించి హింట్ ఇవ్వడంతో ఈ సినిమాపై ఇప్పటికే క్యూరియాసిటి ఏర్పడింది. ఈ మూవీతో యశ్, ప్రశాంత్ నీల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే కేజీఎఫ్ 3 ఎప్పుడొస్తుంది అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జనవరి 8న రాకింగ్ స్టార్ యశ్ పుట్టిన రోజు కేజీఎఫ్ నిర్మాతలు..హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ హ్యాండిల్‌ యశ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా.. కేజీఎఫ్ 2 ఒక అద్భుతం, త్వరలో మరొక రాక్షసుడు కోసం ఎదురుచూస్తున్నాం.. మా కలను నిజం చేసే ఏకైక వ్యక్తి యష్.. హ్యాపీ బర్త్ డే రాకింగ్ స్టార్ యశ్ అంటూ’ ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

దాంతో కేజీఎఫ్ 3 సినిమా కన్ఫామ్ అయినట్టే అని అంటున్నారు అభిమానులు. హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ తో ఇప్పుడు ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేశాయి. యశ్ తర్వాత సినిమా ప్రొడక్షన్ కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తోంది. లేటెస్ట్ గా యశ్ బర్త్ డే నాడు కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ అధినేత లోహిత్ యశ్ ని కలిసి విష్ చేశారు. అయితే ఈ ఫోటో దాదాపు యశ్ సినిమాను కన్ ఫర్మ్ చేసినట్టే అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..