AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Nageswara Rao: టైగర్‌ నాగేశ్వరరావు పక్కా హిట్ అంటున్న ఫ్యాన్స్

కెరీర్‌ బిగినింగ్‌లో టేస్ట్ చేసిన సక్సెస్‌ని ఎండింగ్‌లో అయినా మళ్లీ చూస్తారా.? మధ్యలో మిస్‌ అయిన హిట్‌ని మళ్లీ క్యాచ్‌ చేస్తారా.? స్టువర్ట్ పురం దొంగ టైగర్‌ నాగేశ్వరరావు గురించి ప్రచారంలో ఉన్న రూమర్స్ ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కిన సినిమా టైగర్‌ నాగేశ్వరరావు. రవితేజ టైటిల్‌ రోల్‌ చేశారు. సౌత్‌ ఇండియాలోనే పెద్ద జైలు నుంచి తప్పించుకున్న ఖైదీగా పేరుంది టైగర్‌ నాగేశ్వరరావుకి. అతనికున్న ప్రతిభను రైట్‌ రూట్‌లో ఫ్లో చేస్తే ఎంత పెద్ద వాడయ్యేవాడో టీజర్‌లో స్పష్టంగా చెప్పారు మేకర్స్. ఆద్యంతం ఇంట్రస్ట్ క్రియేట్‌ చేస్తోంది టైగర్‌ నాగేశ్వరరావు టీజర్‌.

Tiger Nageswara Rao: టైగర్‌ నాగేశ్వరరావు పక్కా హిట్ అంటున్న ఫ్యాన్స్
Tiger Nageswara Rao
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Aug 19, 2023 | 1:35 PM

Share

ఒకే ఏడాది బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్‌ హీరో అనిపించుకునే అవకాశం చాలా రేర్‌గా తలుపుతడుతుంది. అలాంటి గోల్డెన్‌ ఆపర్‌చ్యూనిటీని ఆల్రెడీ వదులుకున్నారు రవితేజ. కెరీర్‌ బిగినింగ్‌లో టేస్ట్ చేసిన సక్సెస్‌ని ఎండింగ్‌లో అయినా మళ్లీ చూస్తారా.? మధ్యలో మిస్‌ అయిన హిట్‌ని మళ్లీ క్యాచ్‌ చేస్తారా.? స్టువర్ట్ పురం దొంగ టైగర్‌ నాగేశ్వరరావు గురించి ప్రచారంలో ఉన్న రూమర్స్ ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కిన సినిమా టైగర్‌ నాగేశ్వరరావు.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

రవితేజ టైటిల్‌ రోల్‌ చేశారు. సౌత్‌ ఇండియాలోనే పెద్ద జైలు నుంచి తప్పించుకున్న ఖైదీగా పేరుంది టైగర్‌ నాగేశ్వరరావుకి. అతనికున్న ప్రతిభను రైట్‌ రూట్‌లో ఫ్లో చేస్తే ఎంత పెద్ద వాడయ్యేవాడో టీజర్‌లో స్పష్టంగా చెప్పారు మేకర్స్. ఆద్యంతం ఇంట్రస్ట్ క్రియేట్‌ చేస్తోంది టైగర్‌ నాగేశ్వరరావు టీజర్‌.

ఈ సినిమాతో రవితేజకు హిట్‌ గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. టీజర్‌లో ఇచ్చిన హైప్‌, విజువల్స్ జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తున్నాయి. సంక్రాంతి సీజన్‌లో వాల్తేరు వీరయ్యలో తమ్ముడి కేరక్టర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు ఎంత పాజిటివ్‌ టాక్‌ వచ్చిందో, ఇప్పుడు టైగర్‌ నాగేశ్వరరావులో రవితేజను చూసినప్పుడు కూడా అవే వైబ్స్ కనిపిస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Nupur Sanon (@nupursanon)

వాల్తేరు వీరయ్య సక్సెస్‌ తర్వాత విడుదలైంది రావణాసుర. ఈ సినిమాలో రవితేజ చేసిన కేరక్టర్‌ జనాలకు పెద్దగా ఎక్కకపోవడంతో సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. 2023లో హ్యాట్రిక్‌ని ఈ ఫ్లాప్‌ వల్ల మిస్‌ అయ్యారు రవితేజ. వాల్తేరు వీరయ్య సక్సెస్‌ సింహభాగం ఎలాగూ చిరంజీవిదే.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

రవితేజ సోలో మూవీ రావణాసుర ఎలాగూ ఫ్లాప్‌ అయింది. ఇయర్‌ స్టార్టింగ్‌లో ఉన్న హిట్‌ వైబ్స్ మళ్లీ మాస్‌ మహరాజ్‌ ఫ్యాన్స్ లో మళ్లీ కనిపించాలంటే తప్పకుండా టైగర్‌ నాగేశ్వరరావు హిట్‌ కావాల్సిందే.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి