Sreeleela: శ్రీలీలా మజాకా.. నిమిషానికి 10 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్న బ్యూటీ…
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హాట్ గా నిలిచింది. దాంతో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా 10కి పైగా సినిమాలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ యంగ్ బ్యూటీ.
తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హాట్ గా నిలిచింది. దాంతో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా 10కి పైగా సినిమాలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ యంగ్ బ్యూటీ.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు మరోసారి రవితేజ సరసన మరి సినిమాలో కూడా నటిస్తుందని టాక్.
View this post on Instagram
అలాగే వైష్ణవ్ తేజ్, నితిన్, రామ్ పోతినేనిలాంటి యంగ్ హీరోలతో నటిస్తుంది. ఇదిలా ఉంటే శ్రీలీల భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. మొదటి సినిమాకు కేవలం 5 లక్షలు రెమ్యునరేషన్ అందుకుంది. ఇక ఇప్పుడు ఒకొక్క సినిమాకు 5 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. రెమ్యునరేషన్ ఎక్కువైనా సరే ఈ అమ్మడినే హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారట నిర్మాతలు.
View this post on Instagram
ఇదిలా ఉంటే పలు షాపింగ్ మాల్ ఓపినింగ్స్ కూడా చేస్తుంది శ్రీలీల. అయితే ఈ అమ్మడు షాపింగ్ మాల్స్ ఓపినింగ్ కు పది నిమిషాలు మాత్రమే టైం స్పెండ్ చేస్తుందట. అలాగే నిమిషానికి 10 లక్షలు అందుకుంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అలాగే ఇక పై తాను చేయబోయే సినిమాలకు ఏకంగా 8 కోట్ల వరకు తీసుకోవాలని నిర్ణయించుకుందట.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..