Balakrishna: ఆయన ఓ రియల్ సింహం.. ఆయనతో నటించడం అదృష్టం.. బాలయ్య గురించి వీరసింహారెడ్డి ముద్దుగుమ్మల ఆసక్తికర కామెంట్స్

ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది.

Balakrishna: ఆయన ఓ రియల్ సింహం.. ఆయనతో నటించడం అదృష్టం.. బాలయ్య గురించి వీరసింహారెడ్డి ముద్దుగుమ్మల ఆసక్తికర కామెంట్స్
Balakrishna
Follow us
Rajeev Rayala

| Edited By: Amarnadh Daneti

Updated on: Jan 08, 2023 | 12:55 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి టీజర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. అలాగే ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఆలరించాయి. రీసెంట్ గా జరిగిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలు లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ శ్రుతి , హనీ రోజ్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్ కి బిగ్ థాంక్స్. వారితో ఇది నాకు మూడో సినిమా. వీరసింహారెడ్డి కి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు గోపీచంద్ గారితో ఇది నా మూడో సినిమా. పరిశ్రమలో నాకు అన్నయ లాంటి వ్యక్తితను. తనతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని వుంది. బాలకృష్ణ గారితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. బాలయ్య గారు రియల్ సింహం విత్ గోల్డెన్ హార్ట్. జై బాలయ్య’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే మరో హీరోయిన్ హనీ రోజ్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా లు చేయాలని నా కోరిక. ఆ కోరిక వీరసింహా రెడ్డితో తీరింది. ఈ గొప్ప అవకాశం కల్పించిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి కృతజ్ఞతలు. బాలకృష్ణ గారితో కలసి నటించడం నా అదృష్టం. మా నిర్మాతలకు, మిగతా టీం అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు