AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyamani: అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్

తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.. ఇటీవలే ఈ చిన్నది బాలీవుడ్ లోనికి అడుగు పెట్టింది .. జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించిన ప్రియమణి. తాజాగా మైదాన్ సినిమాలోనూ నటించింది.  ప్రియమణి, అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది.

Priyamani: అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్
Priyamani
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2024 | 1:23 PM

Share

సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్స్‌లో ప్రియమణి ఒకరు. ఈ అమ్మడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.. ఇటీవలే ఈ చిన్నది బాలీవుడ్ లోనికి అడుగు పెట్టింది .. జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించిన ప్రియమణి. తాజాగా మైదాన్ సినిమాలోనూ నటించింది.  ప్రియమణి, అజయ్ దేవగన్ నటించిన ‘మైదాన్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ప్రియమణి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ప్రియమణి ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె చాలా మంది ట్రోల్ చేశారు. అయితే ఆ ట్రోల్స్ మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుందా.? అన్న ప్రశకు ప్రియమణి బదులిస్తూ..

‘నిజం చెప్పాలంటే, అవి నన్ను లేదా నా తల్లిదండ్రులను ప్రభావితం చేయలేదు. నా భర్త నా వెనుక నిలబడ్డాడు’ అని తెలిపింది. నా భర్త నాకు సపోర్ట్ చేశారు. ‘మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నాతో ఉండమని, నన్ను నమ్మమని చెప్పాను. మేము మా జీవితమంతా ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి మార్గంలో  ఏ సమస్య వచ్చినా, మేము దానిని కలిసి ఎదుర్కొంటాము. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం ఆనందంగా ఉంది. అన్ని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసు’’ అని ప్రియమణి అన్నారు.

పెళ్లి నాటికి మేం ముంబైలో లేము.. నేను నా భర్తతో కలిసి బెంగళూరులో ఉన్నాను. మా పై వచ్చిన ట్రోల్స్ కుటుంబాన్ని ప్రభావితం చేయనివ్వలేదు. విమర్శల గురించి పెద్దగా ఆలోచించవద్దని, చివరికి మేమిద్దరం కలిసి ఉండటమే ముఖ్యమని చెప్పాడు’ అని ప్రియమణి తెలిపారు. బాలీవుడ్, సౌత్ సినిమాల్లో ప్రియమణి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. యామీ గౌతమ్ నటించిన ‘ఆర్టికల్ 370’ అలాగే షారుఖ్ ఖాన్ ‘జవాన్’లో ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలో పాపులర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’లోకనిపించనున్నారు. రాజ్ , డికె దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సుచిత్ర పాత్రలో నటించింది ప్రియమణి.

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..