Chiranjeevi: అవును ఆ సినిమా దెబ్బేసింది.. భారీగా నష్టపోయాం.. ఓపెన్‌గా చెప్పిన మెగాస్టార్..
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలాఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ సినిమా వల్ల తాను చాలా నష్టపోయానని తెలిపారు. ఇంతకు మెగాస్టార్ చిరంజీవి నష్టపోయాలా చేసిన సినిమా ఏంటి.?
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే.. మరో వైపు చిరంజీవి కూడా కొడుకుపోటీగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలాఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ సినిమా వల్ల తాను చాలా నష్టపోయానని తెలిపారు. ఇంతకు మెగాస్టార్ చిరంజీవి నష్టపోయాలా చేసిన సినిమా ఏంటి.? మెగాస్టార్ ఏవిధంగా నష్టపోయారు.?
చిరంజీవి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. ఆయన చేయని పాత్ర లేదు అనే చెప్పాలి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. అలాగే అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అయితే సైరా నరసింహారెడ్డి సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నిర్మించారు. సైరా నరసింహారెడ్డి సినిమా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ వంటి భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. అయితే అన్ని భాషల్లో ఈ సినిమా వర్కౌట్ కాలేదు. కొన్ని చోట్ల ఈ సినిమాను నష్టాలు వచ్చాయి. మెగాస్టార్ మాట్లాడుతూ.. సైరా నరసింహారెడ్డి సినిమా నష్టాలూ మిగిల్చిన మాట వాస్తవమే అన్నారు. అలాగే చిరు మాట్లాడుతూ.. నేను చాలా సినిమాలు చేశాను. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాను నాకు స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలనే కోరిక ఉండేది. చాలా కాలంగా ఇందుకోసం ఎదురుచూశా.. సైరాతో నాకు ఆ కోరిక తీరింది. ఆ సినిమా రెండు రాష్ట్రాల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. మిగిలిన భాషల్లో పర్లేదు అనిపించుకుంది. దాంతో మాకు నష్టాలూ వచ్చాయి. గతంలో కూడా రుద్రవీణ అనే సినిమా చేశా.. ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. కానీ డబ్బులు మాత్రం రాలేదు. ఈ సినిమాకు నా తమ్ముడు నాగబాబు నిర్మాతగా వ్యవహరించాడు. నా సంతృప్తి కోసం సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నా అని అన్నారు చిరంజీవి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.