Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: హీరోయిన్ లయ మల్టీటాలెంటెడ్.. ఆ గేమ్‏లో నేషనల్ ఛాంపియన్.. ఏడు సార్లు నేషనల్స్‏కు..

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో దాదాపు 40 సినిమాల్లో నటించింది. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న లయ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కొన్నాళ్లుగా డాన్స్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

Actress Laya: హీరోయిన్ లయ మల్టీటాలెంటెడ్.. ఆ గేమ్‏లో నేషనల్ ఛాంపియన్.. ఏడు సార్లు నేషనల్స్‏కు..
Laya
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2024 | 1:47 PM

స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది అచ్చతెలుగమ్మాయి లయ. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒకప్పుడు హీరోయిన్ లయకు ఫ్యామిలీ అడియన్స్, యూత్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉండేది. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లయ తన నటనతో వరుసగా నంది అవార్డులను అందుకుంది. హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి హిట్ చిత్రాల్లో నటించింది లయ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో దాదాపు 40 సినిమాల్లో నటించింది. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న లయ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కొన్నాళ్లుగా డాన్స్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అలీతో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

లయ ఇండస్ట్రీకి రావడానికి కారణం తన తల్లిదండ్రులే అని తెలిపింది. స్టార్ 2000 కంటెస్ట్ ప్రకటన చూసి తనకు ఇష్టం లేకపోయినా తెలియకుండానే తన ఫోటోస్ పంపారని.. అందులో సెకండ్ వచ్చానని.. విజయవాడలో ఓ కార్యక్రమంలో స్వయంవరం సినిమా యూనిట్ తనను చూసి ఛాన్స్ ఇచ్చారని తెలిపింది. అలాగే హీరోయిన్ లయ చెస్ ఛాంపియన్ అనే విషయాన్ని బయటపెట్టింది. కోనేరు హంపి వాళ్ల నాన్న దగ్గర చెస్ నేర్చుకున్నానని.. దాదాపు 7 సార్లు నేషనల్స్ కు వెళ్లినట్లు తెలిపింది. కానీ ఒకసారి గెలిచానని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు కేవలం హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న లయ.. నేషనల్ లెవల్స్ చెస్ ఆడిందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

సోషల్ మీడియాకు దూరంగా ఉండడంతో తన గురించి రకరకాల రూమర్స్ రాశారని.. ఆర్థిక స్థితి అసలు బాలేదని.. టీ అమ్ముకొని బతుకున్నట్లు చాలా దారుణంగా రాశారని.. అది చూసి తన కుటుంబం కూడా బాధపడిందని చెప్పుకొచ్చింది లయ. ప్రస్తుతం లయ తెలుగులో ఓ సినిమా చేస్తుంది. నితిన్ హీరోగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న తమ్ముడు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తుండగా.. లయ కీలకపాత్ర పోషిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.