Rave Party: ఏం చేసుకుంటారో చేసుకోండి.. డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడం పై హేమ రియాక్షన్
తాను హైదరాబాద్ లోనే ఉన్నానని. ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో అబద్దమని హేమ చెప్పేవని అవాస్తవం అంటూ బెంగుళూరు పోలీసులు రేవు పార్టీలో అదుపులోకి తీసుకున్నవారిలో హేమ ఉన్నారంటూ ఆమె ఫోటోను రిలీజ్ చేశారు. దాంతో హేమ కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పుకోవడం కోసం ఇంట్లో బిర్యానీ చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో రోజుకొక ట్విస్ట్ బయటకొస్తుంది. టాలీవుడ్ కు సంబందించిన వారు కూడా ఉన్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు బయటకు వచ్చింది. అయితే రేవు పార్టీకి సంబందించిన న్యూస్ మీడియాలో టెలికాస్ట్ అవ్వగానే హేమ ఓ వీడియోను విడుదల చేసింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని. ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో అబద్దమని హేమ చెప్పేవని అవాస్తవం అంటూ బెంగుళూరు పోలీసులు రేవు పార్టీలో అదుపులోకి తీసుకున్నవారిలో హేమ ఉన్నారంటూ ఆమె ఫోటోను రిలీజ్ చేశారు. దాంతో హేమ కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పుకోవడం కోసం ఇంట్లో బిర్యానీ చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ వెంటనే బెంగుళూరు పోలీసులు రేవు పార్టీలో దొరికిన వారి వివరాలను మీడియాను వివరించారు. అందులో టాలీవుడ్ నటి ఉన్నట్టు తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దొరికిన వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రస్ తీసుకున్నరాలేదా అని టెస్ట్ కు పంపించారు. కాగా హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అలాగే తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది.
98 మంది శాంపిల్స్‌ను సేకరించారు సీసీబీ. నటి హేమ, ఆషీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తేల్చారుపోలీసులు. హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు పంపించారు. అయితే బెంగళూరు పోలీసుల దగ్గర హేమ డ్రామాలు బాగేనే ఆడింది. తన అసలు పేరు కృష్ణవేణిగా చెప్పింది హేమ. అసలు పేరుతోనే పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీలో వచ్చాకే ఆమెను హేమగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. కాగా డ్రగ్స్ కేసులో తాను లేనంటూ బుకాయిస్తూ వచ్చింది హేమ. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పక్కాగా నిర్దారించారు. డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడంపై స్పందించింది హేమ. ఏం చేస్తారో చేసుకోండి అంటుంది హేమ. సమయం వచ్చినపుడు మాట్లాడతా అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.