Vishal’s Samanyudu: కరోనా ఎఫెక్ట్.. విశాల్ సామాన్యుడు కూడా వెనక్కి వెళ్ళింది.. నయా రిలీజ్ డేట్ ఏంటంటే..
తమిళ స్టార్ హీరో విశాల్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అయ్యి చెప్పుకోదగ్గ విజయాలను అందుకున్నాయి.
Vishal’s Samanyudu: తమిళ స్టార్ హీరో విశాల్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అయ్యి చెప్పుకోదగ్గ విజయాలను అందుకున్నాయి. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశాల్. ఒక ఏడాదిలో విశాల్ నుంచి మినిమమ్ మూడు సినిమాలు పేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఇక రీసెంట్ గా ఎనిమి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశాల్ ఇప్పుడు సామాన్యుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశాల్ ‘సామాన్యుడు’ చిత్రంతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను పెంచింది. టీజర్‌ను బట్టి చూస్తే ఫుల్ యాక్షన్ మోడ్‌లో సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇలాంటి పాత్రల్లో నటించడం విశాల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఈ సినిమాలో డింపుల్ హయతి విశాల్ కు జోడీగా నటిస్తుంది. ఇక యోగిబాబు, బాబురాజ్ జాకబ్, తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగులో ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి బారి లో సినిమా తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తమిళ నాడులో థియేట్సర్స్ మూసివేయడంతో సినిమాను జనవరి 26కు వాయిదా వేశారు. ఈ సినిమా టీమ్ తదుపరి రిలీజ్ డేట్ ను ప్రకటించేసింది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ ఈ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు.
మరిన్ని ఇక్కడ చదవండి :