Acharya: సానా రెస్పాన్స్ దక్కించుకుంటున్న సానా కష్టం పాట.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆచార్య స్పెషల్ సాంగ్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమాకోసం మెగా ఫ్యాన్స్ అంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Acharya: సానా రెస్పాన్స్ దక్కించుకుంటున్న సానా కష్టం పాట.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆచార్య స్పెషల్ సాంగ్..
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 08, 2022 | 8:09 AM

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమాకోసం మెగా ఫ్యాన్స్ అంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన పోస్టర్లు, టీజర్ , పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా ఆచార్య నుంచి ‘సానా కష్టం..’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ‘ఆచార్య‌’ సినిమాను శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. సోమవారం ‘ఆచార్య’ సినిమాలోని మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘సానా కష్టం వచ్చేసిందే మందాకిని..’ అంటూ సాగే ఈ స్పెష‌ల్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రెజీనా క‌సాండ్ర‌ల‌పై చిత్రీక‌రించారు. టాలీవుడ్‌లో డాన్స్‌, ఇర‌గ‌దీసే స్టెప్పులంటే వెంట‌నే గుర్తుకొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇక స్పెష‌ల్ సాంగ్‌లో ఆయ‌న డాన్సింగ్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన మార్క్ స్టెప్పుల‌తో చిరంజీవి డాన్స్ అద‌ర‌గొట్టేశారు. చిరంజీవి డాన్స్ గ్రేస్‌కి, రెజీనా గ్లామ‌ర్ తోడ‌య్యింది.  మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఆచార్య చిత్రంలోని ఈ పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ట సాహిత్యాన్ని అందించ‌గా.. రేవంత్ , గీతా మాధురి పాట‌ను ఆల‌పించారు.  ఇప్పటికే 13 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ పాట. ఈ సాంగ్ థియేట‌ర్స్‌లో మాస్ ఆడియెన్స్‌, మెగాభిమానులను  అలరించడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Faria Abdullah : వరుస ఆఫర్లు అందుకుంటున్న ముద్దుగుమ్మ.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన భామ..

Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కరోనా పాజిటివ్‌..

Amritha Aiyer: అమృత అయ్యర్ అందాల మెరుపులు.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్న లేటెస్ట్ ఫోటోస్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!