Vijay Deverakonda: అవయవదానంపై రౌడీ హీరో కీలక నిర్ణయం.. ‘సూపర్ అన్నా’ అంటూ ప్రశంసలు కురిపిస్తోన్న ఫ్యాన్స్
ఆర్గాన్ డొనేషన్ వల్ల ఎంతో మంది జీవితాలు రీస్టార్ట్ అవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అందుకే నేను కూడా అవయవదానం చేస్తాను. నా తర్వాత నా ఆర్గాన్స్ వల్ల ఎవరో ఒకరు జీవించడం, వారిలో నేను కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం' అని చెప్పుకొచ్చాడీ రౌడీ హీరో.
టాలీవుడ్ యంగ్ హీరో లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అవయవదానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను బతికున్నంత వరకు తన శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటానని, పోయిన తర్వాత వాటిని దానం చూస్తానని ప్రకటించాడు. కాగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆధ్వర్యంలో చిన్నారుల్లో కాలేయ మార్పిడి అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్‌తో పాటు మలావత్ పూర్ణ హాజరయ్యారు. కాలేయ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ సేవలను వీరిద్దరూ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించి వారికి బహుమతులు అందించారీ సెలబ్రిటీలు. అనంతరం ఆర్గాన్ డొనేషన్ అంశంపై ప్రసంగించిన విజయ్ అవవయదానంపై కీలక ప్రకటన చేశాడు. తాను కూడా అవయవదానం చేస్తానని చెప్పుకొచ్చాడు. ‘ ఎవడే సుబ్రహ్మణ్యం చేస్తున్న సమయంలో మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు. ఆ సమయంలో ఆర్గాన్ డొనేషన్‌తోనే మా నాన్న క్షేమంగా కోలుకున్నారు. అందుకే వారు ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఆర్గాన్ డొనేషన్ వల్ల ఎంతో మంది జీవితాలు రీస్టార్ట్ అవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అందుకే నేను కూడా అవయవదానం చేస్తాను. నా తర్వాత నా ఆర్గాన్స్ వల్ల ఎవరో ఒకరు జీవించడం, వారిలో నేను కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం’ అని చెప్పుకొచ్చాడీ రౌడీ హీరో.
అవయవ దానం చేయడం దక్షిణాసియా దేశాల్లో తక్కువని, విలువైన అవయవాలను మట్టిపాలు చేసే బదులు ఇంకొకరికి దానం చేస్తే వారి ఆయుష్షును పెంచినవారమవుతామని కూడా పేర్కొన్నాడు విజయ్. కాగా దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆస్పత్రి వర్గాలు ట్విటర్‌లో పోస్ట్ చేశాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు విజయ్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ అన్నా, మంచి మనసున్న హీరో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. లైగర్‌తో నిరాశపర్చిన విజయ్ ఖుషితో హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తైంది. అయితే ఇటీవల సామ్ అనారోగ్యం బారిన పడడంతో సినిమా విడుదల వాయిదా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని విజయ్ ఇటీవల ప్రకటించాడు.
Vijay Deverakonda | Encouraging Organ Donation at Adult and Pediatric Liver Transplantation Awareness Program, PACE Hospitals #VijayDeverakonda #livertransplant #pacehospitals pic.twitter.com/iIUneNPb6w
— PACE Hospitals (@PACEHospitals) November 16, 2022
#VijayDeverakonda celebrating #ChildrensDay by gifting warriors of end-stage liver disease at @PACEHospitals Adult and Pediatric Liver Transplantation Awareness Program #pacehospitals #LiverTransplant @TheDeverakonda ?????? pic.twitter.com/Kxh27yauYB
— PACE Hospitals (@PACEHospitals) November 16, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..