16 January 2025

మూడేళ్లకే విడాకులు.. రెండో పెళ్లికి ముందే తల్లైన హీరోయిన్.. ఇప్పుడు

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. 

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మూడేళ్లకే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్. 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అమలా పాల్. తెలుగులో అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలు సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది అమల.

అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అమలా పాల్.. సినిమాల కంటే సక్సెస్ కంటే వ్యక్తిగత విషయాలతో వార్తలలో నిలిచింది. 

దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన మూడేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత మరింత గ్లామర్ గా కనిపించింది. 

కొన్నాళ్లకు తన మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేస్తూ మరోసారి వార్తలలో నిలిచింది. అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. 

కొద్ది రోజులుగా ఈవెంట్ మేనేజర్ తో ప్రేమలో ఉన్నానంటూ ప్రకటించి పది రోజులకే రెండో పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఈ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. 

అయితే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. గతేడాది పండంటి బాబుకు జన్మనిచ్చిన అమలా పాల్ బాబు ఫోటోస్ షేర్ చేసింది.