Oke Oka Jeevitham Movie: శర్వానంద్ ఒకే ఒక జీవితం నుంచి అమ్మ పాట.. సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నా సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు ఈ కుర్ర హీరో
Oke Oka Jeevitham Movie: యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నా సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు ఈ కుర్ర హీరో. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు శర్వానంద్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా రీలీజ్ అయిన మహా సముద్రంపై హీరో శర్వానంద్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేశారు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు శర్వా. ఒకే ఒక జీవితం సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇందులో కీలక పాత్రలో అమల నటిస్తుంది.
ఈ సినిమా ఓకే టైమ్ ట్రావెల్ కథ. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ బైలింగ్విల్ సినిమాతో శ్రీ కార్తిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అమ్మ పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యారు చిత్రాయునిట్. రిపబ్లిక్ డే సందర్భంగా 2022 జనవరి 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ పాటని విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. . ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. జేక్స్ బీజోయ్ ఈ పాటకి ట్యూన్ సమకూర్చగా.. దివంగత లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ సినిమాను ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
This song will melt your hearts ❤️#AmmaSong First single from #Kanam releasing on 26 Jan 2022 at 5 PM
?@sidsriram @amalaakkineni1 @riturv @twittshrees @actorsathish @thilak_ramesh pic.twitter.com/OqGdWyPxOo
— Sharwanand (@ImSharwanand) January 24, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :