గాయాల పర్వంలో మరో టాలీవుడ్ హీరో

టాలీవుడ్‌లో యంగ్ హీరోలు వరసగా గాయాలు పాలవుతున్నారు. వరుణ్ తేజ్, నాగశౌర్య, సందీప్ కిషన్..తాజాగా మరో యంగ్ హీరో శర్వానంద్ ‌కూడా షూటింగ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం శర్వానంద్ ’96’ మూవీలో నటిస్తున్నాడు. సినిమా షూట్‌లో భాగంగా శర్వా థాయ్‌లాండ్‌లో గత రెండు రోజులుగా స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మూడోొ రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాలి ఎక్కువగా రావడంతో ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాళ్లపై […]

గాయాల పర్వంలో మరో టాలీవుడ్ హీరో
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 16, 2019 | 10:45 AM

టాలీవుడ్‌లో యంగ్ హీరోలు వరసగా గాయాలు పాలవుతున్నారు. వరుణ్ తేజ్, నాగశౌర్య, సందీప్ కిషన్..తాజాగా మరో యంగ్ హీరో శర్వానంద్ ‌కూడా షూటింగ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం శర్వానంద్ ’96’ మూవీలో నటిస్తున్నాడు. సినిమా షూట్‌లో భాగంగా శర్వా థాయ్‌లాండ్‌లో గత రెండు రోజులుగా స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మూడోొ రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాలి ఎక్కువగా రావడంతో ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాళ్లపై ల్యాండ్ అవ్వాల్సిన వ్యక్తి..భుజాలను నేలపై మోపుతూ బలంగా భూమిని తాకాడు. ఈ ఘటనలో షోల్డర్ డిస్ లొకేట్ అవ్వడంతో పాటు… కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ప్రమాదం తర్వాత అక్కడే ప్రాథమిక  చికిత్స తీసుకున్న శర్వా హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా వెళ్లి ఓ కార్పోరేట్ హస్పటల్‌లో జాయిన్ అయ్యాడు. అతనిని పరీక్షించిన డాక్టరు..శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. కాగా సోమవారం ఈ యంగ్ హీరోకు ఆపరేషన్ జరగనుంది. సర్జరీ తర్వాత కనీసం నాలుగు రోజుల హస్పటల్‌లోనే ఉండాలని వైద్యులు శర్వాకు సూచించారు.