AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది వరలక్ష్మి పర్సనల్ విషయం- విశాల్

చెన్నై: తనపై నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు హీరో విశాల్. గత నడిగర్ సంఘం ఎలక్షన్స్‌లో విశాల్, శరత్ కుమార్ పోటీ పడిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరిద్దరూ ఒకరిపై, ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో విశాల్ గెలవడంతో గొడవ సద్దుమణిగింది. తాజాగా జరుగుతోన్న నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్‌ పోటీ చేయని విషయం తెలిసిందే. అయినా కూడా  శరత్‌కుమార్‌ను ఘాటుగా విమర్శిస్తూ ఓ వీడియో విడుదల చేశారు విశాల్‌. దీనిపై […]

అది వరలక్ష్మి పర్సనల్ విషయం- విశాల్
Ram Naramaneni
|

Updated on: Jun 16, 2019 | 12:28 PM

Share

చెన్నై: తనపై నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు హీరో విశాల్. గత నడిగర్ సంఘం ఎలక్షన్స్‌లో విశాల్, శరత్ కుమార్ పోటీ పడిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరిద్దరూ ఒకరిపై, ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో విశాల్ గెలవడంతో గొడవ సద్దుమణిగింది. తాజాగా జరుగుతోన్న నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్‌ పోటీ చేయని విషయం తెలిసిందే.

అయినా కూడా  శరత్‌కుమార్‌ను ఘాటుగా విమర్శిస్తూ ఓ వీడియో విడుదల చేశారు విశాల్‌. దీనిపై ఆయన కుమార్తె, నటి వరలక్ష్మి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన తండ్రి ఈ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయనపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు..? అంటూ విశాల్‌కు ప్రశ్నలను ఎక్కుపెట్టింది. విశాల్‌పై ఉన్న నమ్మకం ఈ వీడియోతో పోయిందని, ఇప్పటికే చాలా దిగజారిపోయిన అతడు నా ఓటును కూడా కోల్పోయాడని పేర్కొంది.

వాస్తవానికి  వీరిద్దరూ గతంలో  లవ్‌లో ఉన్నారని కోలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే ఈ జంట పలు వేదికల్లో సందడి చేశారు. అప్పట్లో విశాల్‌ తన తండ్రిపై విమర్శలు చేసినా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా మాట్లాడటం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఇటీవల విశాల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వరలక్ష్మి వ్యాఖ్యలపై విశాల్‌ స్పందించారు. అది ఆమె పర్సనల్ విషయం అన్న  హీరో.. ఆమెకు మాట్లాడే హక్కు ఉందని చెప్పారు.

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..