‘మల్లేశం’ సినిమాకు కేటీఆర్ ప్రశంసలు

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మల్లేశం’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. హస్య నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రదారుడిగా ఈ చిత్రం తెరకెక్కింది.  సామాన్యుడి జీవిత విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని, అంతరించిపోతున్న చేనేత కళకు ఈ చిత్రం జీవం పోసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. శనివారం రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో ‘మల్లేశం’ ముందస్తు ప్రదర్శనను ఆయన వీక్షించారు. సినిమా చూసిన తర్వాత చేనేత వస్త్రాలు ధరించే వారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు .చేనేత కార్మికుల […]

'మల్లేశం' సినిమాకు కేటీఆర్ ప్రశంసలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 15, 2019 | 9:56 PM

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మల్లేశం’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. హస్య నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రదారుడిగా ఈ చిత్రం తెరకెక్కింది.  సామాన్యుడి జీవిత విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని, అంతరించిపోతున్న చేనేత కళకు ఈ చిత్రం జీవం పోసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. శనివారం రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో ‘మల్లేశం’ ముందస్తు ప్రదర్శనను ఆయన వీక్షించారు. సినిమా చూసిన తర్వాత చేనేత వస్త్రాలు ధరించే వారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు .చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గుర్తు చేశారు. ‘మల్లేశం’ సినిమాకు పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని చిత్ర యూనిట్‌కు హామీనిచ్చారు.

పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా  ‘మల్లేశం’ మూవీ రూపొందించారు. ‘ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్‌ యాన్‌ ఆర్డినరీ మ్యాన్‌’ అనేది ఉపశీర్షిక. పోచంపల్లికి చెందిన మల్లేశం చేనేత వస్త్రాలను సులభంగా నేయడానికి యంత్రాన్ని కనుగొన్నారు. రాజ్‌ ఆర్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మార్క్‌ కే రోబిన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఝాన్సీ, అనన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది.