AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadavallu Meeku Johaarlu : రిలీజ్‌కు ముందు మేము చెప్పిందే ఇప్పుడు జరిగింది: శర్వానంద్

శర్వానంద్, రష్మిక మందన్న జంట గా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈనెల 4న (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Aadavallu Meeku Johaarlu : రిలీజ్‌కు ముందు మేము చెప్పిందే ఇప్పుడు జరిగింది: శర్వానంద్
Sharwanand
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2022 | 7:25 PM

Share

Aadavallu Meeku Johaarlu : శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈనెల 4న (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కిశోర్ తిరుమల ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు దర్శకత్వం వహించారు.ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శనివారం నాడు రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. నేను చెప్పినట్లుగానే విడుదల రోజు మా అమ్మ నాన్న థియేటర్లో సినిమా చూశారు. ఇలాంటి సినిమా రావడానికి చాలా కాలం పట్టిందని తెలిపారు. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ను వారు వ్యక్తం చేశారు అని తెలిపింది రష్మిక. ఇంటిలోని మహిళలు కూడా చూసే సినిమా ఇది. మన కుటుంబంలోని వ్యక్తులు ఈ సినిమాలోని పాత్రలు ద్వారా మన కళ్ళ ముందు కనిపిస్తారు. నిన్న కొన్ని థియేటర్లకు వెళ్ళాం. అక్కడ అంతా ఫ్యామిలీతోనే సినిమాకు వచ్చారు. వచ్చే వారం కూడా మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకముంది అన్నారు. ఈ సందర్భంగా తన పెండ్లి గురించి వివరిస్తూ, సినిమాలో చూపించినట్లుగా నా తల్లి ఖుష్బూ ఎంత కేర్ తీసుకుంటుందో తెలిసిందే. కానీ మా అమ్మనాన్నలు నీకు నచ్చితే మేం మాట్లాడతాం అని చెప్పారని చెప్పుకొచ్చింది రష్మిక.

ఇక శర్వానంద్ మాట్లాడుతూ..మేం విడుదలకు ముందు ఏదైతే అనుకున్నామో అది నేడు జరిగింది. చాలా సంతోషంగా వుంది అన్నారు. నా కుటుంబసభ్యులుతోపాటు స్నేహితులు కూడా సినిమా చూసి బాగుందన్నారు. ఇది బాగోలేదని ఒక్కరూ కూడా అనడం నేను వినలేదు. మనింటిలో జరిగే కథలా వుంటుంది. మేం నవ్విస్తామని చెప్పాం. అలాగే థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూనే వున్నారు. హ్యాపీగా చాలా రోజుల తర్వాత థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారని శర్వా అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: బాబు బంగారం.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం మహేష్ మరో అడుగు..

Samantha: సామ్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా.. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌!..

F3 Movie : ఎఫ్ 3 సెట్‌లో నానా రచ్చ చేసిన నాగ రత్తమ్మ.. వెంకీ- వరుణ్ ఏం చేశారంటే..!

ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు