ముగ్గురిని ప్రేమించా.. ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు.. సందీప్ కిషన్ ఆసక్తికర కామెంట్స్
స్నేహగీతం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సందీప్ కిషన్. ఆతర్వాత శర్వానంద్ హీరోగా నటించిన ప్రస్థానం సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఈ సినిమా సందీప్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు . తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నారు ఈ కుర్ర హీరో. ఇక ఇప్పుడు ఊరు పేరు భైరవ కోన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. స్నేహగీతం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సందీప్ కిషన్. ఆతర్వాత శర్వానంద్ హీరోగా నటించిన ప్రస్థానం సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఈ సినిమా సందీప్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు . తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నారు ఈ కుర్ర హీరో. ఇక ఇప్పుడు ఊరు పేరు భైరవ కోన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సందీప్ కిషన్. గతంలో సందీప్ కిషన్ కు ఓ హీరోయిన్ కు లవ్ ఎఫైర్ ఉందంటూ కొన్ని గుసగుసలు కూడా వినిపించాయి. ఆ హీరోయిన్ నే సందీప్ పెళ్లి చేసుకుంటాడని కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా సందీప్ కిషన్ తన లవ్ స్టోరీలు , బ్రేకప్స్ గురించి తెలిపాడు. తన లైఫ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమించా అని తెలిపాడు సందీప్ కిషన్. సందీప్ మాట్లాడుతూ.. నా జీవితంలో ముగ్గురు అమ్మాయిలను ప్రేమించా.. చాలా సీరియస్ గా ఆ అమ్మాయిలను ప్రేమించా. ఒక అమ్మాయితో ఏకంగా నాలుగేళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నాను. కానీ అది వర్కౌట్ కాలేదు అన్నాడు సందీప్.
అలాగే మరో అమ్మాయితో రెండేళ్లు, మరో అమ్మాయితో రెండున్నరేళ్లు రిలేషన్ షిప్ మెయింటేన్ చేశాను. కానీ ఎందుకో తెలియదు ఏదీ వర్కౌట్ కాలేదు. కానీ నేనున్నా పొజీషన్ చూసుకుంటే అవేమి ఇప్పుడు నా లైఫ్ లో ప్రాముఖ్యం కాదు అని అర్ధమైంది అని తెలిపారు సందీప్ కిషన్. నేను ప్రేమించిన ముగ్గురు అమ్మాయిలు ఇండస్ట్రీకి చెందిన వారే కానీ మేము రిలేషన్ లో ఉన్న విషయం చాలా సీక్రెట్ గా ఉంచాం. అయితే నేను రెజీనా లవ్ లో ఉన్నాం అంటూ వార్తలు వచ్చాయి. కానీ మా మధ్య అలాంటివి ఏమీ లేవు. తాను నాకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు సందీప్ కిషన్. రెజీనా నాకు కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్ .. నా కష్ట సుఖాలు, ఎత్తు పల్లాలు అని తనకు తెలుసు. అలాగే నా పెళ్లికి చాలా సమయం ఉంది అని అన్నారు సందీప్ కిషన్.
సందీప్ కిషన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




