Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Project K: “ప్రాజెక్ట్ – K” మొదలు పెట్టిన పాన్ ఇండియా స్టార్.. షూటింగ్‌లో జాయిన్ అయిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ప్రాజెక్ట్ - K అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.

Project K: ప్రాజెక్ట్ - K మొదలు పెట్టిన పాన్ ఇండియా స్టార్.. షూటింగ్‌లో జాయిన్ అయిన ప్రభాస్
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 11, 2021 | 9:39 PM

Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ప్రాజెక్ట్ – K అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొననె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్  మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో పూర్తి నిడివి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్  ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అయ్యారు. ప్రభాస్ – దీపికా పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్ లను నిర్మించారు. ఇప్పటివరకు వచ్చిన అత్యంత ఖరీదైన భారతీయ ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటి.

మేకర్స్ ప్రభాస్ – దీపికపై చిత్రీకరించిన మొదటి షాట్ యొక్క వీడియో బైట్‌ను విడుదల చేశారు. కెమెరాలో ప్రభాస్ – దీపికా  చేతులు కలిపినట్లు వీడియో చూపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తుంది. టైమ్ ట్రావెల్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతుంది వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉంటే ప్రభాస్ లైన్ లో పెట్టిన సినిమాలన్నీ భారీ సినిమాలే.. వరుసగా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేసాడు ప్రభాస్ ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సలార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఇలా వరుస ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు డార్లింగ్ .

మరిన్ని ఇక్కడ చదవండి : 

N Chandrababu Naidu : బాలయ్య ‘అఖండ’ సినిమా పై చంద్రబాబు కామెంట్స్.. ఏమన్నారంటే..

Young Heroines 2021: ఈ ఏడాది తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసిన కొత్త ముద్దుగుమ్మలు వీరే..

Ram Charan-Jr NTR: ఎన్టీఆర్‌ను నడుముపై గిల్లిన చరణ్.. తారక్ రియాక్షన్ చూడండి