Bigg Boss 5: బిగ్ బాస్ షోపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అక్కినేని నాగార్జున.. ఏమన్నారంటే..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Sep 03, 2021 | 4:33 PM

Bigg Boss Telugu 5: వినోద ప్రియులు మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ షో బిగ్ బాస్. స్టార్‌ మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్‌బాస్‌ మరో మారు తెలుగు ప్రేక్షకులకు అలరించడానికి  సిద్ధమైంది.

Bigg Boss 5: బిగ్ బాస్ షోపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అక్కినేని నాగార్జున.. ఏమన్నారంటే..
Nag

వినోద ప్రియులు మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ షో బిగ్ బాస్. స్టార్‌ మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్‌బాస్‌ మరో మారు తెలుగు ప్రేక్షకులకు అలరించడానికి  సిద్ధమైంది. బిగ్‌ బాస్‌ ఐదవ సీజన్‌ గ్రాండ్‌ ప్రీమియర్‌ స్టార్‌ మా ఛానెల్‌పై సెప్టెంబర్‌ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. గత సీజన్‌ గ్రాండ్‌ ఫైనల్‌ , భారతదేశంలో మరే రియాల్టీ షో కూడా సాధించలేనట్టి రీతిలో అత్యధిక  వ్యూస్ రేటింగ్‌ను సాధించి రికార్డులను సృష్టించింది ఈ గేమ్ షో. ఆ రికార్డులను తిరగరాసే రీతిలో ఈ సారి బిగ్‌బాస్‌ షో ఉండనుందని తెలుస్తుంది. స్టార్‌ మా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ తెలుగు మరో సీజన్‌ను మీముందుకు తీసుకువస్తునందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేడు మా దగ్గర ఉన్న మోస్ట్ ఎంటర్టైనింగ్ షోలలో బిగ్‌ బాస్‌ ఒకటి. వీక్షకులకు 100 రోజులకు పైగా వినోదాన్ని ఇది అందిస్తుంది. ఈ గేమ్ షో అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది..’’ అని స్టార్‌ మా అధికార ప్రతినిధి అన్నారు. ఇక  అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో పాటుగా డ్రామా, రొమాన్స్‌, యాక్షన్‌, వినోదంను కలిపి ఆకట్టుకునే టాస్క్‌లతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదం అందించనున్నారు.

ఈ సందర్భంగా హోస్ట్ , హీరో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్‌గా నిలిచాయి. ఈ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దీనివల్ల కంటెస్టెంట్స్‌ను మరింతగా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు. భారతదేశంలో ఏడు భాషలలో 37 సీజన్‌లను పూర్తి చేసుకున్న ఈ షో ఎండెమోల్‌షైన్‌ గ్రూప్‌ సొంతం. బిగ్‌బాస్‌ తెలుగు–సీజన్‌ 5, స్టార్‌మాలో సెప్టెంబర్‌05, సాయంత్రం 6 గంటలకు తొలిసారి ప్రసారం అవుతుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం–శుక్రవారం వరకూ మరియు రాత్రి 9 గంటలకు శని–ఆదివారాలలో ప్రసారమవుతుంది.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Punam Kaur: డ్రగ్స్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్‌ కౌర్‌.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానంటూ.

Anushka Sharma: ఓవల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్ల భార్యలు సందడి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

బిగ్ బాస్ 5: ఈ ఐదు కంటెస్టెంట్లదే అత్యధిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu