Gopichand: సాలిడ్ హిట్ లేకపోయినా.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే అందుకుంటున్న యాక్షన్ హీరో..

నిజం, వర్షం, జయం లాంటి సినిమాల్లో విలన్ గా మెప్పించిన గోపి.. ఆతర్వాత యజ్ఞం సినిమాతో మరోసారి హీరోగా రీ లాంచ్ అయ్యారు. యజ్ఞం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలతో ఆకట్టుకున్నాడు.  రీసెంట్ గా రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Gopichand: సాలిడ్ హిట్ లేకపోయినా.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే అందుకుంటున్న యాక్షన్ హీరో..
Gopichand
Follow us
Rajeev Rayala

|

Updated on: May 19, 2023 | 8:56 AM

టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా తనకంటూ మంచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు గోపీచంద్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత విలన్ గా మెప్పించారు. నిజం, వర్షం, జయం లాంటి సినిమాల్లో విలన్ గా మెప్పించిన గోపి.. ఆతర్వాత యజ్ఞం సినిమాతో మరోసారి హీరోగా రీ లాంచ్ అయ్యారు. యజ్ఞం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలతో ఆకట్టుకున్నాడు.  రీసెంట్ గా రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇదిలా ఉంటే గోపీచంద్ చాలా కాలంగా హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే గోపీచంద్ కు సరైన హిట్ లేకున్నా.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదని తెలుస్తోంది. 2014లో లౌక్యం సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన గోపీచంద్ ఆ తర్వాత ఒక్క హిట్టును కూడా తన ఖాతాలో వేసుకోలేక పోయాడు. ఇక గోపీచంద్ రెమ్యునరేషన్ విషయానికొస్తే..

గోపీచంద్ దాదాపు 5.5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ను గోపీచంద్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఫ్లాప్స్ లో ఉన్న హీరోకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ దక్కడం కూడా విశేషం అనే చెప్పాలి. ఇక గోపీచంద్ సాలిడ్ హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.