Dhanush: తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన ధనుష్.. బాడీ గార్డ్స్ అత్యుత్సాహం..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండే ధనుష్ తాజాగా తిరుమలలో సందడి చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు ధనుష్. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో ధనుష్ ఒకరు. సినిమా సినిమాకు గ్యాప్ లేకుండా వరుసగా చేసుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు ధనుష్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండే ధనుష్ తాజాగా తిరుమలలో సందడి చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు ధనుష్. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. క్యాప్ పెట్టుకొని మాస్ వేసుకొని కనిపించరు ధనుష్. ధనుష్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. శ్రీవారిని దర్శించుకున్న ధనుష్ కు అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు. అలాగే ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి..స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ధనుష్ ను చూడటానికి భక్తులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీపడటంతో ధనుష్ బాడీ గార్డ్స్ వారిని అడ్డుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిమానులను కంట్రోల్ చేసే క్రమంలో ధనుష్ బాడీ గార్డ్స్ అత్యుత్సాహం చూపించారు.
బాడీ గార్డ్స్ నెట్టివేయడంతో ఓ కెమెరామెన్ కిందపడ్డారు. దాంతో మీడియా ప్రతినిధులు ధనుష్ బాడీ గార్డ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ఇటీవలే ఆయన సార్ అనే సినిమా చేశారు. అలాగే ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ అనే సినిమా చేస్తున్నారు. అదేవిధంగా తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.
