Akkineni Nagarjuna: నాగార్జునకు రొమాన్స్ బోర్ కొట్టిందా.. అందుకే అలా చేస్తున్నారా..?
ఏమైందో మరి.. ఈ మధ్య మనసు మార్చుకుని యాక్షన్ వైపు వెళ్తున్నారు నాగార్జున. ఆఫీసర్, వైల్డ్ డాగ్, ఘోస్ట్ అంటూ పూర్తిగా హాలీవుడ్ తరహా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు.
Nagarjuna Movies: నాగార్జున అంటే ముందుగా గుర్తుకొచ్చేది రొమాన్స్. వయసు 60 దాటాక కూడా మన్మథుడు 2(Manmadhudu 2) అంటూ మాంచి రొమాంటిక్ సినిమా చేసారు ఈయన. అలాంటి హీరో ఈ మధ్య మారిపోయారు. ఒకప్పట్లా రొమాన్స్ వైపు నాగ్ మనసు వెళ్లడం లేదు. పూర్తిగా యాక్షన్ జోనర్‌లోకి వెళ్లిపోతున్నారు. మూడేళ్ళ నుంచి నాగ్ ఎంచుకుంటున్న కథల్లోనూ మార్పు కనిపిస్తుంది. ఆ తరహా సినిమాలు వరసగా షాకులిస్తున్నా.. నాగ్ మాత్రం యాక్షన్ వైపే అడుగేయడానికి కారణమేంటి..? నాగార్జున అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే ఇమేజ్ ఇదే.. చుట్టూ అందమైన భామలతో ఈయన ఆడి పాడుతుంటే చూడ్డానికి కూడా భలేగా ఉంటుంది. అందుకే 60 దాటాక కూడా బంగార్రాజు రాసలీలల్ని ప్రేక్షకులు బానే ఎంజాయ్ చేసారు. అయితే ఏమైందో మరి.. ఈ మధ్య మనసు మార్చుకుని యాక్షన్ వైపు వెళ్తున్నారు ఈ సీనియర్ హీరో. ఆఫీసర్, వైల్డ్ డాగ్(Wild Dog), ఘోస్ట్ అంటూ పూర్తిగా హాలీవుడ్(Hollywood) తరహా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు నాగార్జున.
గత కొన్నేళ్లుగా ఎక్కువగా స్టైలిష్ యాక్షన్ కథలనే ఎంచుకుంటున్నారు నాగార్జున. మధ్యలో బంగార్రాజు లాంటి రొమాంటిక్ కామెడీ చేసినా.. ఈ కథకు ఎప్పుడో ఏడేళ్ల కిందే బీజం పడింది. అందుకే దాన్ని పూర్తి చేసారు నాగ్. నాలుగేళ్ళ కింద వర్మ చెప్పిన కథ నచ్చి ఆఫీసర్ చేసారు.. అది దారుణంగా ఫ్లాపైంది. గతేడాది అహిషోర్ సోలోమన్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ వైల్డ్ డాగ్ చేసారు. దీనికి రెస్పాన్స్ బాగానే వచ్చినా.. కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. కానీ ఓటిటిలో వైల్డ్ డాగ్ రెస్పాన్స్ అదిరిపోయింది. తాజాగా ప్రవీణ్ సత్తారుతో ది ఘోస్ట్ సినిమా చేస్తున్నారు నాగ్. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇది కూడా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతుంది. గరుడ వేగ తర్వాత ప్రవీణ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో నాగార్జున రా ఏజెంట్‌గా నటిస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్. మరి ఆఫీసర్, వైల్డ్ డాగ్‌తో అంచనాలు అందుకోలేకపోయిన నాగార్జున.. ది ఘోస్ట్‌తో టార్గెట్ రీచ్ అవుతారా లేదా చూడాలి.